న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

No. 4లో పుజారా: నా మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చన్న గంగూలీ

Sourav Ganguly Picks Cheteshwar Pujara For No. 4 Slot | Oneindia Telugu
Sourav Ganguly backs Cheteshwar Pujara to bat at No. 4 for India in ODIs

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.

న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి: మెక్‌కల్లమ్ నుంచి రోహిత్ వరకు ఎవరేమన్నారు?న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి: మెక్‌కల్లమ్ నుంచి రోహిత్ వరకు ఎవరేమన్నారు?

నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధత

నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధత

తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ అనంతరం మళ్లీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో మళ్లీ No. 4పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ గంగూలీ ఓ ఆశ్చర్యకర సూచన చేశాడు. పుజారాను ప్రపంచకప్‌కు ఎంపిక చేసి, అతణ్ని నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అన్నాడు.

నా మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చు

నా మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చు

"నా మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. నా సూచనకు వాళ్లు నవ్వొచ్చు కూడా. నా వరకైతే ‘నంబర్‌ 4'కు పుజారా చక్కగా సరిపోతాడు. ఫీల్డింగ్‌లో అతడు మరీ చురుకు కాదని తెలుసు కానీ మంచి బ్యాట్స్‌మన్‌. నా మాటలతో కొందరు దిగ్భ్రాంతికి గురవుతారని నాకు తెలుసు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్‌

పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్‌

"కానీ, టీమిండియా ప్రయత్నించిన ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. కొన్నిసార్లు వన్డే క్రికెట్‌లో పటిష్టత అవసరమైనప్పుడు పుజారా ఆ కొరత తీరుస్తాడు. ముఖ్యంగా జట్టులోని టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌కు టన్నుల కొద్దీ పరుగులు చేసే సత్తా ఉన్నప్పుడు అతడు జట్టులో చక్కగా ఇమిడిపోతాడు" అని గంగూలీ చెప్పాడు.

ద్రవిడ్‌ పోషించిన పాత్రలో ఇప్పుడు పుజారా

ద్రవిడ్‌ పోషించిన పాత్రలో ఇప్పుడు పుజారా

ఒకప్పుడు భారత వన్డే జట్టులో రాహుల్ ద్రవిడ్‌ పోషించిన పాత్రలో ఇప్పుడు పుజారా సరిగ్గా సరిపోతాడని గంగూలీ చెప్పాడు. కాగా, మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈసారి వరల్డ్ కప్ రౌండ రాబిన్ పద్ధతిలో జరగనుంది.

Story first published: Saturday, March 16, 2019, 9:43 [IST]
Other articles published on Mar 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X