Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ నిర్ణయం బాగుంది: హర్షించిన మాజీ కెప్టెన్లు

హైదరాబాద్: వచ్చే నెలలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరిస్‌లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు బీసీసీఐ అంగీకరించడంపై మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. డీఆర్ఎస్ విధానంపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా మాజీ కెప్టెన్లు అజారుద్దీన్, సౌరభ్ గంగూలీలు స్పందించారు.

తాను ఆడుతున్న రోజుల నుంచి డీఆర్ఎస్ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని సౌరభ్ గంగూలీ పేర్కొన్నారు. ఎమ్‌ఐటీ నిపుణుల బృందం రూపొందించిన ప్రస్తుత డీఆర్ఎస్ విధానం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉందని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీంతో బీసీసీఐ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వెనకడుగు వేయలేదని పేర్కొన్నాడు. బీసీసీఐ చేసిన కొన్ని సూచనలను కూడా ఈ బృందం ఆమోదించడంతో డీఆర్ఎస్‌ని వ్యతిరేకించడానికి కారణం కూడా లేదని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరిస్‌లో డీఆర్ఎస్‌ను పరీక్షించాలనే నిర్ణయం నిజంగా ఆహ్వానించదగిందేనని అన్నాడు.

Sourav Ganguly, Azharuddin back BCCI decision to use DRS

టీమిండియా ఇప్పటికే ఈ డీఆర్ఎస్ టెక్నాలజీని వాడుకోవాల్సి ఉందని అజారుద్దీన్ పేర్కొన్నాడు. ఈ టెక్నాలజీకి అప్పట్లో బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్ల అనేక మ్యాచ్‌ల్లో గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయామని చెప్పాడు. ఇప్పటికే ఆలస్యమైనా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బాగుందని అజారుద్దీన్ అన్నాడు.

కాగా, భారత్, ఇంగ్లాండ్ మధ్య వచ్చే నెలలో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్‌ను అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే తాజా డీఆర్‌ఎస్‌ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐ పెద్దలు దీనిపై చర్చించారు.

మెట్టు దిగిన బీసీసీఐ: భారత్-ఇంగ్లాండ్ సిరిస్‌లో డీఆర్ఎస్

తాజాగా డీఆర్ఎస్ విధానాన్ని ఐసీసీ మరింతగా మెరుగుపరిచి అందుకు సంబంధించిన వీడియో ప్రజెంటేషన్‌ను బీసీసీఐ బోర్డు సభ్యులతో పాటు కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చూపింది. దీంతో బీసీసీఐ ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరిస్‌లో డీఆర్ఎస్ అమలు చేసేందుకు అంగీకరించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+