Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిజంగా అది ఓ పీడకల: క్రీడల్లో ‘మైండ్‌ గేమ్స్‌’‌పై గంగూలీ

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రీడల్లో 'మైండ్‌ గేమ్స్‌'పై ఓ పుస్తకాన్ని రూపొందించే పనిలో పడ్డాడు. ఓ పుస్తకం విడుదల కార్యక్రమానికి హాజరైన గంగూలీ పుస్తకాలు రాయడమనేది ఓ పీడకలగా అభివర్ణించాడు.

 నిజంగా ఓ పీడకల

నిజంగా ఓ పీడకల

'ఓ చోట కూర్చుని లేక మరొకరికి విషయాలను వివరిస్తూ ఆ తర్వాత దోషాలను సరిదిద్దుకుంటూ అనుకున్న సమయానికి పబ్లిషర్‌ చేతికి అందించడమనేది నిజంగా ఓ పీడకల. అయితే చాలా రోజుల నుంచి నన్ను పుస్తకం రాయమని అడుగుతున్నారు. కానీ నేనేం గొప్ప రచయితను కాను' అని గంగూలీ అన్నాడు.

 క్రీడల్లో మైండ్‌ గేమ్స్‌ గురించి

క్రీడల్లో మైండ్‌ గేమ్స్‌ గురించి

'అలాగే క్రీడల్లో మైండ్‌ గేమ్స్‌ గురించి కూడా రాయాలని అడిగారు. ఓ క్రీడ అభివృద్ధి చెందాలంటే ఓ ఆటగాడి మైండ్‌ సెట్‌ ఎంత ముఖ్యపాత్ర పోషిస్తుందో ఇందులో ఉంటుంది. కానీ నా జీవిత చరిత్ర గురించి మాత్రం ఇప్పుడు ఆలోచించడం లేదు. నిజానికి గత 15-20 ఏళ్లలో నేనేం చేశానో ఆలోచించేందుకు ప్రస్తుతం సమయం కూడా లేదు' అని గంగూలీ స్పష్టం చేశాడు.

 అప్పట్లో కావాలనే ఆలస్యంగా వచ్చిన గంగూలీ

అప్పట్లో కావాలనే ఆలస్యంగా వచ్చిన గంగూలీ

2001లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు వైజాగ్‌ వన్డేలో టాస్‌ కోసం గంగూలీ అప్పట్లో కావాలనే ఆలస్యంగా వచ్చి స్టీవ్‌ వాను కొన్ని నిమిషాలపాటు వేచి చూసేలా చేశాడు. ఇది అప్పట్లో వివాదాస్పమైంది. అయితే దీనిని ఆసీస్‌పై గంగూలీ మైండ్‌ గేమ్‌గా పేర్కొన్నారు.

గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 2003 వరల్డ్ కప్ పైనల్‌కు

గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 2003 వరల్డ్ కప్ పైనల్‌కు

1996లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 2003 వరల్డ్ కప్ పైనల్‌కు చేరుకుంది. అప్పటివరకు నెమ్మదిగా ఉన్న భారత క్రికెట్‌కు గంగూలీ దూకుడుని నేర్పించాడు. గంగూలీ కెరీర్‌లో ఎన్నో వివాదాస్పద సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+