For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీ

IPL 2019 : Delhi Capitals Appoint Sourav Ganguly As Advisor | Filmibeat Telugu
Sourav Ganguly appointed Delhi Captials advisor for IPL 2019

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా నియమించుకుంది ఆ జట్టు యాజమాన్యం. ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఈ నియామకంతో సౌరవ్ గంగూలీ... ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేయనున్నారు.

గంగూలీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్నేళ్లుగా జిందాల్స్‌తో పాటు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ గురించి తెలుసు. ఆ గ్రూప్ తాజా స్పోర్ట్స్ వెంచర్‌లో భాగస్వామి అవడం చాలా ఆసక్తిగా ఉన్నా. ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా" అని అన్నాడు.

2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా

2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా

"గంగూలీ అనుభవం, సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానం. గంగూలీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉందని" అని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఛైర్మన్‌ పార్థ్‌ జిందాల్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోచింగ్‌ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది. వేలంలో కొత్త ఆటగాళ్లను కోనుగోలు చేయడంతో పాటు పలువురిని రిటైన్ చేసుకుంది.

కొత్త జెర్సీతో బరిలోకి

కొత్త జెర్సీతో బరిలోకి

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలివలేదు. కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది.

మార్చి 24న వాంఖడేలో ముంబైతో ఢిల్లీ తొలి మ్యాచ్

మార్చి 24న వాంఖడేలో ముంబైతో ఢిల్లీ తొలి మ్యాచ్

ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. మార్చి 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. ఐపీఎల్ 2019 సీజన్‌ తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

తొలి మ్యాచ్ ఆదాయం మొత్తం అమరజవాన్ల కుటుంబాలకే

తమ సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.

Story first published: Thursday, March 14, 2019, 15:15 [IST]
Other articles published on Mar 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+