
భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీకి మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ టీమిండియాకు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా నాయకత్వం వహించారు. ఇద్దరూ మైదానంలో దూకుడుగా ఆడతారు. మ్యాచ్ ఆసాంతం ఉద్వేగభరితంగా ఉంటారు. వారి చర్యలు, వారి జట్లను నడిపించే విధానం కూడా ఇంచుమించు సేమ్‌గా ఉంటుంది. కాబట్టి వీరిద్దరిని పోల్చుతూ కామెంట్లు, పోస్టులు రావడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రెసిడెంట్‌గా గంగూలీ వ్యవహరిస్తున్నాడు. పోలిక ఎప్పుడూ కూడా మన అగ్రెస్సివ్ నెస్ బట్టి ఉండకూడదు.. ఎవరి నైపుణ్యం ఎంతుందో దాన్ని బట్టి ఉండాలి, కోహ్లీ తన కంటే ఎక్కువ నైపుణ్యం కల ప్లేయర్ అని ఒప్పుకున్నాడు. వారి దూకుడు ఆధారంగా కోహ్లీతో పోల్చడం గురించి గంగూలీని ది రణవీర్ షోలో హోస్ట్ అడగగా గంగూలీ ఈ విధంగా బదులిచ్చాడు.
'అది పోలిక అని నేను అనుకోను. ఆటగాడిగా నైపుణ్యం పరంగా పోలిక ఉండాలి. అతను (కోహ్లీ) నా కంటే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను. మేము వేర్వేరు తరాలలో ఆడాం. ఇద్దరం చాలా క్రికెట్ ఆడాం. బహుశా నా కంటే అతను ఎక్కువ ఆటలు ఆడగలడు. ప్రస్తుతం గణాంకాల పరంగా నేను అతని కంటే ఎక్కువగా ఆడినట్లు కన్పించినా.. అతను దాన్ని అధిగమించగలడు. అతను అద్భుతమైన ప్లేయర్ అంటూ కొనియాడాడు.
కోహ్లీ చాలా కాలం పాటు పేలవమైన ఫామ్‌తో బాధపడ్డాడు. అతను ఆసియాకప్‌లో తిరిగి తన ఫామ్ అందుకున్నాడు. అతను రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. అలాగే టీ20 కెరీర్లో తన సెంచరీని కూడా నమోదు చేశాడు. అతను ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 122పరుగులు బాదాడు. తద్వారా భారత్ తరఫు అత్యధిక టీ20 స్కోరర్‌గా నిలిచాడు. ఇక 2019 నంబర్ తర్వాత కోహ్లీ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో రికీ పాంటింగ్‌తో సమానంగా 71సెంచరీలను నమోదు చేశాడు.. సచిన్ టెండూల్కర్ వీరి కంటే ఎక్కువగా 100సెంచరీలతో తొలిస్థానంలో ఉన్నాడు.