Sourav Ganguly: మరో సస్పెన్స్ ట్వీట్ చేసిన దాదా.. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇలాంటిది రాబోతుందని పేర్కొంటూ?

క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నిన్న స్పష్టత లేకుండా ఓ ట్వీట్ చేయడం సంచలనమైంది. తాను బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ ఆ ట్వీట్లో పరోక్షంగా వెల్లడించాడు. బుధవారం దాదా చేసిన ట్వీట్ అభిమానులను కాస్త అయోమయానికి గురిచేసింన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌లో బీసీసీఐ అధ్యక్ష పదవి విషయాన్ని ప్రస్తావించిన గంగూలీ.. ఇకపై ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇక తాజాగా గంగూలీ మరో సస్పెన్స్ ట్వీట్ చేశాడు. అతను చేసిన ట్వీట్ నెట్టింటా మరోసారి ప్రకంపనలు రేపుతోంది. ఇండియాలోనే సరికొత్త ఆవిష్కరణను ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే అది ఎడ్యకేషనల్ యాప్ కాదని స్పష్టం చేశాడు. అసలింతకు దాదా ఏం చెప్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాదా 11.30కు ఈ ట్వీట్ చేయగా.. ఇంతవరకు ఆ సస్పెన్స్ ఏంటో మాత్రం వెల్లడించలేదు. 12 దాటి చాలా టైం అవుతున్నా దాదా నుంచి రెస్పాన్స్ మాత్రం రాలేదు.
నిన్నటి ట్వీట్లో ఏమన్నాడంటే..
ఇకపోతే నిన్నటి ట్వీట్‌లో దాదా స్పందిస్తూ.. 'భారత క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన 1992 నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న 2022 వరకు నా క్రికెట్ ప్రయాణం గొప్పగా సాగింది. ఈ క్రికెట్ జీవితంలో నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది. ముఖ్యంగా నాకు లభించిన మద్దతు వెల కట్టలేనిది. నా ప్రయాణంలో భాగమై అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు. వారి సహాయ సహకారల వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఈ రోజు నేను ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో కూడా తనకు ఈ తరహా మద్దతే లభిస్తుందని ఆశిస్తున్నాను'అని దాదా సుదీర్ఘ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
దాదా తప్పుకోవట్లేదన్న జై షా
అయితే ఈ ట్వీట్‌లో ఎక్కడా బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొనలేదు. కానీ అతని వ్యాఖ్యల ఉద్దేశం మాత్రం అదే అన్నట్లుగా అర్థమవుతోంది.మరోవైపు సౌరవ్ గంగూలీ ట్వీట్‌పై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించాడు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. దాదా బీసీసీఐ పదవికి రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే గత కొంతకాలంగా భారత క్రికెట్‌లో జరుగుతున్న వరుస పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సెక్రటరీ జై షా అతి జోక్యాన్ని అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సహించడం లేదు. అయితే రాజకీయాల్లోకే వెళ్లే ఆలోచనతోనే గంగూలీ ఈ ట్వీట్ చేసినట్లు మరికొందరు వాదిస్తున్నారు.

కొత్తగా ఏం చేయబోతున్నాడో మరీ
2024లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల్లో దాదా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాదాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాజకీయ ఎంట్రీ వార్తలకు బలం చేకూర్చేలా గంగూలీ ట్వీట్ చేశాడు. ఇక తాజా ట్వీట్ ద్వారా.. ఏదైనా కొత్త ఆవిష్కరణను తీసుకొస్తాడా.. లేదంటే కొత్త రకంగా పార్టీని స్థాపిస్తాడా.. లేదంటే క్రికెట్లో మరో కొత్త తరహా టోర్నీని ప్రవేశపెడతాడా.. లేదంటే క్రికెట్ యాప్ తీసుకొస్తాడా.. ఏమీ పాలుపోవడం లేదు. ఇక గంగూలీ ఏం చెబుతాడో మరీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications