
సౌతాంప్టన్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే మూడు టెస్టులు పూర్తి చేసుకుని నాలుగో టెస్టులోనూ విజృంభించి ఆడుతోంది. ఈ క్రమంలోనే నాలుగో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేశారు. అయితే మూడో టెస్టులో భారీ ఆధిక్యంతో గెలుపొందిన టీమిండియాను భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హెచ్చరిస్తున్నాడు. 1-2తేడాతో కొనసాగుతోన్న టెస్టు సిరీస్‌లో అత్యుత్సాహం పనికిరాదని చెప్పుకొస్తున్నాడు.
దానికి కారణం కూడా చెప్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టు అదే గడ్డపై భారత్‌ను తొలి రెండు టెస్టుల్లోనూ ఓడించి చిత్తు చేసింది. తొలి టెస్టులో 39 పరుగుల తేడా మాత్రమే అనిపించినా.. రెండో టెస్టులో మాత్రం భారీగా చిత్తు అయింది. ఈ క్రమంలోనే భారత్‌ను ఒకే టెస్టు విజయంతో పొంగిపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు సౌరవ్ గంగూలీ.
నేనైతే నాలుగో టెస్టులో కూడా కోహ్లీటాస్ గెలిచి ఉంటే కాస్త ఆలోచించి కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంటాడని అనుకున్నా. కానీ, జోయ్ రూట్ టాస్ గెలిచినప్పటికీ భారత్‌కు ఫీల్డింగ్‌యే ఎంచుకోవడం ఒక అదృష్టం. ఇంగ్లాండ్ జరుగుతోన్న మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న గంగూలీ జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు ఈ మైదానం వేట ప్రదేశంవంటిదని కొనియాడాడు.
నాలుగో టెస్టు తొలి రోజు టీమిండియాపై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 76.4 ఓవర్లలో 246 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా గురువారం ఆట ముగిసే సమయానికి 19/0తో నిలిచింది. క్రీజులో శిఖర్ ధావన్ (3 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (11 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ జట్టు ఇంకా 227 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది.