
సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్
ఈ సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మ్యాచ్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మహేంద్ర సింగ్ ధోనిని ముందు పంపాల్సిన అవసరం ఉందని అన్నాడు. మంగళవారం సౌరభ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ రెండో టీట్వంటీలో భారత్ గెలిచినా అది బౌలర్ల గొప్పదనమేనని, బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టుకు మంచిది కాదని పేర్కొన్నాడు.

అవసరమైతే జట్టులో కొన్ని మార్పులు
బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఆశీష్ నెహ్రా రాణించడం వల్లే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగిందని గంగూలీ పేర్కొన్నాడు. బెంగుళూరులో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్నాడు. అవసరమైతే జట్టులో కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పాడు.

మనీష్ పాండేను మూడో స్ధానంలో ఆడించాలి
'మనీష్ పాండేను మూడో స్ధానంలో ఆడించాలి. మిగిలి ఉన్న ఓవర్లను బట్టి రైనాను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే సరిపోతుంది. రైనాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల చివర్లో భారీ షాట్లు ఆడే ఆటగాడిని కోల్పోతున్నాం. పాండ్యా, ధోనీ ఉన్నా.. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ ఉండడం కొంత మంచిదని నాకు అనిపిస్తోంది' అని గంగూలీ అన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనికి ప్రమోషన్ ఇవ్వాలి
'ఇక ధోని విషయానికొస్తే కచ్చితంగా అతనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వాలి. ఎందుకంటే అతడు మునపటిలా కాదు. ఇప్పుడు చాలా స్వేచ్చగా ఆడుతున్నాడు. అలాంటి సమయంలో కోహ్లీ అతడిని సరిగా ఉపయోగించుకుంటే జట్టు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా ధోని సలహా తీసుకుంటే మంచిది' అని కోహ్లీకి గంగూలీ సూచించాడు.


Click it and Unblock the Notifications











