Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వికెట్ తీసిన ఆనందంలో రొనాల్డో స్టైల్‌ను కాపీ కొట్టిన సౌమ్య సర్కార్

Soumya Sarkar imitates Cristiano Ronaldo’s signature celebration after dismissing Aaron Finch

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్లు 20 ఓవర్లకు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఆసీస్ ఓపెనర్ల జోడీని బంగ్లా ప్రధాన బౌలర్లు విడదీయలేకపోయారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ బంతిని పార్ట్ టైమర్ సౌమ్య సర్కార్‌ చేతికిచ్చాడు. నాలుగు బంతుల తర్వాత సౌమ్య సర్కార్ ఎట్టకేలకు వికెట్ తీశాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సౌమ్య సర్కార్ ఆసీస్ ఓపెనర్లను విడదీశాడు. జట్టు స్కోరు 121 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ (53) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్ హాసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

వికెట్ తీసిన ఆనందంలో సౌమ్య సర్కార్ భిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. పోర్చుగల్ స్టార్ పుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను అనుకరిస్తూ ఉన్న ఫోటోలను పోస్టు చేసి ''పుట్టక మాత్రమే వేరు'' అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఐసీసీపై విమర్శల వర్షం కురుస్తోంది.

రొనాల్డో వంటి దిగ్గజ ఆటగాడితో సౌమ్య సర్కార్‌ని పోల్చడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ''గుర్రాల పోటీలో గాడిదలు ఎప్పటి నుంచి పరిగెడుతున్నాయి'' అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ''ఐసీసీ చేసిన అతి చెత్త ట్వీట్ ఇదే.. పిల్లి పులిలా నడుస్తుందని.. మనం దాన్ని పులితో పోలుస్తామా'' అని మరొకరు పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 381 పరుగులు చేశారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ఉస్మాన్ ఖవాజా (72 బంతుల్లో 89; 10 ఫోర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.

{headtohead_cricket_1_10}

దీంతో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం సాధించి 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికర్ రహీమ్ (97 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (62; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (50 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Story first published: Friday, June 21, 2019, 17:46 [IST]
Other articles published on Jun 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+