Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన షమి (Video)

క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి క్షమాపణలు చెప్పాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి శ్రమిస్తున్న వీడియోను పోస్ట్ చేసి, దానికి ఎమోషనల్‌‌‌గా తన భావాలను రాసుకొచ్చాడు. అతిత్వరలో తిరిగి రెడ్ బాల్ క్రికెట్‌కు తిరిగొస్తానని భరోసా ఇస్తూ పేర్కొన్నాడు. గాయం కారణంగా కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు షమి ఎంపికకానీ విషయం తెలిసిందే.

అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో షమి తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడని భావించారంతా. కానీ సిరీస్ ప్రారంభ సమయానికి షమి పూర్తిగా కోలుకోవడంపై సందేహంగా ఉండటంతో షమి లేకుండా 18 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే రీఎంట్రీపై అంచనాలను అందుకోకపోవడంతో బీసీసీఐకి, అభిమానులకు షమి సారీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

Sorry BCCI Mohammed Shami s Viral Post on Missing India Squad for Australia Tour

''తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. బౌలింగ్ ఫిట్‌నెస్‌లో రోజురోజుకు మెరుగుపడుతున్నాను. మ్యాచ్‌కు, దేశవాళీ క్రికెట్‌కు సిద్ధంగా ఉండటానికి కఠోరంగా శ్రమిస్తున్నాను. క్రికెట్ అభిమానులకు, బీసీసీఐకి క్షమాపణలు. అయితే అతిత్వరలో రెడ్ బాల్ క్రికెట్‌కు తిరిగొస్తాను'' అని షమి పేర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండల గాయంతో షమి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెయిన్ కిల్లర్స్ వాడుతూ వన్డే ప్రపంచకప్ ఆడిన షమి ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఏలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు.

అయితే కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో జరిగే రంజీ మ్యాచ్‌ల్లో షమి బరిలోకి దిగనున్నాడని బెంగాల్ టీమ్ మేనేజ్మెంట్ ఇటీవల పేర్కొంది. నవంబర్ 6 నుంచి కర్ణాటక, నవంబర్ 13 నుంచి మధ్యప్రదేశ్‌తో బెంగాల్ తలపడనుంది. రంజీ మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ షమి సాధిస్తే ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో కూడా షమి ఎంపిక అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయిదు టెస్టుల నవంబర్ 22 నుంచి జనవరి 3వరకు జరగనుంది. దీంతో చివరి మూడు టెస్టులకు అయినా షమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.

Story first published: Sunday, October 27, 2024, 13:10 [IST]
Other articles published on Oct 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+