Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లక్ష్యం రూ.1300 కోట్లు: ఐపీఎల్ 10లో సోనీ సరికొత్త రికార్డు

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ అత్యంత ఖరీదైన లీగ్‌ల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ మరికొన్ని గంటల్లో 10వ సీజన్‌‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించనుంది.

ఐపీఎల్ ఆరంభ వేడుకలు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభం కాకముందే స్పాన్సర్లు కోట్లు కుమ్మరిస్తున్నారు.

ఐపీఎల్ ప్రారంభమైన 2007 నుంచి మ్యాచ్‌లను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ప్రసారం చేస్తోంది. అయితే ఈసారి విశేషం ఏమిటంటే మ్యాచ్ జరిగే సమయంలో మధ్య మధ్యలో ప్రకటనల కోసం నిర్దేశించిన స్లాట్లను ప్రముఖ కార్పోరేట్ కంపెనీలన్ని ముందస్తుగా బుక్‌ చేసుకున్నాయి.

ఐపీఎల్ 10వ సీజన్‌లో యాడ్‌ల ద్వారా తమ ఆదాయాన్ని రూ.1300 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది సోనీ పిక్చర్స్. అయితే ఊహించని దానికంటే ముందుగానే ఆదాయ లక్ష్యాన్ని అందుకుంది. సీజన్ ప్రారంభంకాక ముందే పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అర్జించడంతో మార్కెట్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి.

'ప్రతిఏటా ఐపీఎల్‌ అద్భుతమైన వృద్ధి రేటుని నమోదు చేస్తోంది. లీగ్‌లో పదో సీజన్‌ అయినప్పటికీ గత సీజన్ల కన్నా అత్యుత్తమ సంవత్సరంగా ఇది నిలుస్తుంది. ఈసారి అత్యంత ఎక్కువ మంది స్పాన్సర్లను పొందగలిగాం.' అని సోనీ నెట్‌వర్క్స్‌ సేల్స్‌ ప్రెసిడెంట్‌ రోహిత్‌ గుప్తా వెల్లడించారు.

ఐపీఎల్ 10వ సీజన్‌లో చైనా కంపెనీలు

ఐపీఎల్ 10వ సీజన్‌లో చైనా కంపెనీలు

మరోవైపు ఐపీఎల్‌ను పలు చైనా కంపెనీలు తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఐపీఎల్‌ 10వ సీజన్‌కు వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇక కోహ్లీ సారథ్యంలోని బెంగళూరుతో పాటు కోల్‌కతా (కేకేఆర్‌) జట్లకు జియోనీ ప్రధాన స్పాన్సర్‌గా వ్వవహరిస్తోంది.

జియోనీ చీఫ్‌ అరవింద్‌ వోహ్రా ఇలా

జియోనీ చీఫ్‌ అరవింద్‌ వోహ్రా ఇలా

‘భారతలో క్రికెట్‌, బాలీవుడ్‌ను ఒక మతంగా భావిస్తారు. ఐపీఎల్‌ ద్వారా ప్రచారం కల్పించుకోవడం ఒక సంస్థగా మాకు ముఖ్యం. ఫ్యాన్స్‌తో పాటు మాకు కూడా ఇది దీపావళి పండగ వంటిది' అని భారత్‌లో జియోనీ చీఫ్‌ అరవింద్‌ వోహ్రా తెలిపాడు. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆర్‌ జట్ల జెర్సీల హక్కుల కోసం జియోనీ సంస్థ రూ.75 కోట్లు ఖర్చు చేసింది.

ప్రతి మ్యాచ్‌లో ప్రకటనల కోసం 2,300 సెకన్లు

ప్రతి మ్యాచ్‌లో ప్రకటనల కోసం 2,300 సెకన్లు

ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌లో ప్రకటనల కోసం 2,300 సెకన్లను కేటాయించారు. ఇందులో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో అత్యధికంగా 300 సెకన్లను దక్కించుకుంది. ఇందులో 10 సెకన్ల ప్రకటన కోసం రూ.5.2 లక్షలను చెల్లించాలి. ఐపీఎల్ లీగ్‌కు పలు కంపెనీలు కో-ప్రజెంటింగ్‌ స్పాన్సర్లు, అసోసియేట్‌ స్పాన్సర్లుగా వ్వవహరిస్తున్నాయి.

అసోసియేట్‌ స్పాన్సర్లు రూ.5.75 లక్షలు

అసోసియేట్‌ స్పాన్సర్లు రూ.5.75 లక్షలు

ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌, ప్రపంచస్థాయి ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వేరువేరుగా ప్రకటనల కోసం 210 సెకన్ల నిడివిని దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలు ప్రతి 10 సెకన్ల కోసం రూ. 5.2 లక్షలను చెల్లిస్తున్నాయి. ఇక అసోసియేట్‌ స్పాన్సర్లుగా ఉన్న సియట్‌ టైర్స్‌, విమల్‌ పాన్‌ మసాలా, యమహా మోటార్స్‌, పార్లే ఆగ్రో ఫ్రూటీ, యెస్‌బ్యాంకు, పాలీ క్యాబ్‌, వోల్టాస్‌, హావెల్స్‌, మేక్‌మై ట్రిప్‌, పార్లే బిస్కేట్స్‌, మారుతీ సుజుకీ కంపెనీలు 10 సెకన్ల ప్రకటన కోసం రూ.5.75 లక్షలను చెల్లిస్తున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+