For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్ దేవుడు సామీ.. మరో భారత క్రికెటర్‌కు సాయం చేసిన సోనూ సూద్! ఈసారి 15 నిమిషాల్లో!

Sonu Sood helps Harbhajan Singh by arranging Remdesivir injection

ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూ సూద్‌. దేశంలో కరోనా పంజా విసురుతున్న వేళ అభాగ్యులకు అండగా నిలుస్తూ 'రియల్‌ హీరో' అనిపించుకుంటున్నారు. కరోనా బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. మొదటి నుంచి తన శక్తిమేర కృషి చేసి ఆపదలో ఉన్నవారిని ఇప్పటికీ ఎంతో మందిని ఆదుకున్నారు. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూ సాయం అందిస్తున్నారు. సినిమా, క్రీడా, రాజకీయ రంగాల్లోని ప్రముఖులకు కూడా సోనూ సేవలు అందాయి.

Sonu Sood నువ్ దేవుడు సామీ... Harbhajan Singh కు సోనూ సాయం.. ప్రముఖులకు కూడా ! || Oneindia Telugu

హర్భజన్‌కు సోనూ సాయం:

తాజాగా సోనూ సూద్‌ నుంచి మరో భారత క్రికెటర్ సాయం పొందాడు. ఇటీవల మీరట్‌లోని తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలని భారత మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా అభ్యర్థించగా.. కేవలం 10 నిమిషాల్లోనే అతనికి సోనూ సూద్ సాయం చేశాడు. బుధవారం భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా సోనూ నుంచి సాయం పొందాడు. కర్ణాటకలోని తన సన్నిహితులకి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కావాలని ట్విట్టర్ ద్వారా కోరగా.. 15 నిమిషాల్లోనే స్పందించిన సోనూ సూద్ సాయం చేశాడు. 'భాజీ .. డెలివరీ అవుతుంది' అని ట్వీట్ చేశాడు. ఆపై తన బృందం ద్వారా బాధితుడికి ఇంజక్షన్ అందించాడు.

థాంక్యూ సోదరా:

తమ బందువులకు ఇంజెక్షన్ అందుతుందని సోనూ సూద్‌ చెప్పగా.. హర్బజన్ సింగ్ ధన్యవాదాలు చెప్పాడు. 'థాంక్యూ సోదరా. దేవుడి ఆశీస్సులతో మీరు బాగుండాలి. ఈ సేవలు ఇలాగే కొనసాగాలి' అని ఆశీర్వదిస్తూ హర్భజన్ రీ ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవ్వగా.. 'నువ్ దేవుడు సామీ' అంటూ ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోనూ. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలలనుంచి ఎవరు సాయం కోరినా.. సోనూ ముందుకొస్తున్నారు. ఆయన పెద్ద మనసు చూసి దేశంలోని సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల దాకా అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి:

కోట్లాది రూపాయలు వెచ్చించి:

కేవలం ఒక విద్యార్థిని కోసం మొత్తం గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించిన పెద్ద మనుసు సోనూ సూద్‌ సొంతం. ఇలా అనేక రకాలుగా గత ఏడాది కాలంగా నిరంతరాయంగా పూర్తి నిబద్ధతతో తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. సోనూ సాయం పొందిన ఎంతో మంది కరోనాను జయించారు. ప్రజల కోసం కోట్లాది రూపాయలను ఆయన వెచ్చిస్తున్నారు. బాధితుల కోసం తన ఆస్తులు తాకట్టుపెట్టి మరి అండగా నిలుస్తున్నారు. సోనూ సూద్‌ ఫౌండేషన్‌ పేరుతో పలు కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 ఆకట్టుకొని భజ్జి:

ఆకట్టుకొని భజ్జి:

ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలంలో రూ.2 కోట్లకి హర్భజన్ సింగ్‌ని కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఏడు మ్యాచ్‌లకిగానూ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడించింది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020కి దూరంగా ఉన్న భజ్జీ.. ఐపీఎల్ 2021లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. భజ్జి బౌలింగ్‌ని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు టార్గెట్ చేయడంతో.. అతని ఓవర్ల కోటాని కూడా పూర్తిచేయలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌‌లో 29 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. టీమ్‌లలో కరోనా కేసులు నమోదవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.

Story first published: Thursday, May 13, 2021, 10:14 [IST]
Other articles published on May 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+