నితీష్ రాణా తండ్రికి మాటిచ్చిన సంజూ శాంసన్ నాన్న

హైదరాబాద్: ఇది ఇద్దరి స్నేహితుల ప్రస్తావన. ఔను, నిజమే.. శాంసన్, రాణా కుటుంబాల మధ్య పదిహేనేళ్లుగా స్నేహం ఉంది. దారా సింగ్‌కు తమ్ముడైన అనిల్, విశ్వనాథ్ ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుళ్లుగా పని చేసేవారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అనిల్.. విశ్వనాథ్‌తో కలిసి నితీష్‌తోపాటు సంజూకి కూడా శిక్షణ ఇచ్చేవారు. వారి ప్రోద్బలంతో సంజూ, నితీష్ కలిసి లోకల్ మ్యాచుల్లో ఆడేవారు.
వారిద్దరి ఆట విషయమై అనిల్, విశ్వనాథ్‌లు తరచూ చర్చించేవారు. క్రమంగా దారా సింగ్‌తోనూ విశ్వనాథ్‌కు స్నేహం పెరిగింది. ఈ స్నేహంతోనే రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా జైపూర్ వెళ్లిన దారా సింగ్.. విశ్వనాథ్‌కు ఫోన్ చేశారు. ఆయన కూడా మ్యాచ్ చూడటానికి వస్తున్నారేమోనని కనుక్కున్నారు. కానీ కేరళలోని ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా పని చేస్తున్న విశ్వనాథ్ అతని కొడుకు మ్యాచ్ చూసేందుకు రాలేకపోయాడు.
దీంతో శాంసన్, రాణా ఒకే మ్యాచ్‌లో తలపడుతుంటే.. ఫ్రెండ్‌తో కలిసి చూసి ఆనందించాలన్న దారాసింగ్ కోరిక నెరవేర లేదు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో సంజూ, నితీష్‌ల మ్యాచ్ ఢిల్లీలో ఇద్దరం కలిసి చూద్దామని విశ్వనాథ్ తన మిత్రుడికి మాటిచ్చారు.
బెంగళూరు జట్టుపై సంజూ శాంసన్ 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచినప్పుడు శాంసన్‌ను అభినందిస్తూ.. విశ్వనాథ్‌కు దారాసింగ్ సందేశం పంపారు. విశ్వనాథ్ 2008లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కేరళ వెళ్లిపోగా.. రాణా వాళ్ల బాబాయి అనిల్ ఎస్ఐగా పని చేస్తున్నారు. శాంసన్, రాణాల మధ్య కూడా స్నేహం ఉంది. మ్యాచ్‌లో ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడినా.. మ్యాచ్ ముగిశాక మాత్రం స్నేహితులుగానే ఉంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications