న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులోకి ఎంపిక చేయలేదని...: పాక్ యువ క్రికెటర్ ఆత్మహత్య

By Nageshwara Rao
Son of Former Pakistani Cricketer Commits Suicide Over Non-Selection

హైదరాబాద్: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ ఆమిర్‌ హనీఫ్‌ కుమారుడు మహ్మద్ జర్యాబ్ మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెలెక్టర్లు, కోచ్‌లు తనను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మనస్థాపం చెందిన జర్యాబ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గతేడాది జనవరిలో జర్యాబ్ అండర్‌-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన ఓ టోర్నీలో పాల్గొన్నాడు. అయితే గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే అతడికి అర్ధాంతరంగా ఇంటికి పంపించారు. మళ్లీ జట్టులోకి ఎంపిక చేస్తామని ఆ సమయంలో చెప్పారు.

అయితే వయస్సు పెద్దగా ఉన్న కారణంతో జర్యాబ్‌ పేరుని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో తనను తప్పిస్తూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై అతడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పాక్‌ మీడియా తెలిపింది. అయితే తన కుమారుడి చావుకు కోచ్‌లు అవలంభించిన వైఖరే కారణమని హనీఫ్‌ ఆరోపించాడు.

'అండర్‌-19 జట్టులో అర్హత ఉన్నప్పటికీ వయసు పైబడిందని కోచ్‌లు, సెలెక్టర్లు నిరాకరించడంతోనే నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు' అని హనీఫ్‌ ఆరోపించాడు. కాగా, హనీఫ్‌ 1990 దశకంలో పాకిస్థాన్ వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో అతడు ఐదు వన్డే మ్యాచ్‌లాడాడు.

Story first published: Wednesday, February 21, 2018, 13:12 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X