Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుబేరుడి కొడుకుతో రాజస్థాన్.. కూలీ కొడుకుతో పంజాబ్ టీమ్

Son of a labourer, Kashmiri Manzoor Dar (Pandav) is ready to wreak havoc for KXIP

హైదరాబాద్: అమితాత్సాహంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థఆన్ రాయల్స్ ఆటగాళ్ళను కొనుగోలు చేశాయి. వారందరూ విభిన్నమైన నేపథ్యం కలవారు. ఒకరు కుబేరుడు కొడుకైతే, ఇంకొకరు కూలీ కొడుకు. వాళ్ల కొనుగోలు ధరలు పక్కను ఉంచితే ఇద్దరూ ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నామంటూ తమ అభిప్రాయాలు ఉద్వేగపడ్డారు.

ఐపీఎల్ పూర్తి సమాచారం పట్టిక రూపంలో..

విక్రమ్ బిర్లా:
ఆర్యమాన్‌ విక్రమ్‌ బిర్లాను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.30 లక్షలు కొనుగోలు చేసింది. విక్రమ్‌ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్‌ మంగళం బిర్లా తనయుడు.. రూ.30 లక్షలు అతడికి చిన్న విషయం. వ్యాపారంతో తండ్రితో చేరి కెరీర్‌ను నిర్మించుకోవడం 20 ఏళ్ల విక్రమ్‌కు తేలికే. కానీ ఆటంటే అతడికి ప్రేమ. మైదానంలో శ్రమించి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. వేలంలో ముందు రౌండ్లో అమ్ముడుపోకున్నా రెండో రౌండ్లో రాజస్థాన్‌ జట్టు అతణ్ని ఎంపిక చేసుకుంది.

మంజూర్‌ దర్‌ను రూ.20 లక్షలకు పంజాబ్‌.. జట్టులోకి తీసుకుంది. ఇతను కశ్మీర్‌ బ్యాటింగ్‌ సంచలనం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అతడు క్రికెట్‌ను వదిలి పెట్టని తీరు స్ఫూర్తి కలిగించేదే. అతడిదో పేద కుటుంబం. కూలీ అయిన తండ్రికి సహకరించేందుకు తానూ శ్రమించాడు. రాత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. పగలు ఇతర చిన్నా చితకా పనులు చేసేవాడు. కానీ రోజు కొన్ని గంటలపాటు ప్రాక్టీస్‌ చేయడం మాత్రం మానేవాడు కాదు. స్టేడియానికి కొన్నేళ్ల పాటు సైకిల్‌పైనే వెళ్లాడు. దర్‌కు మంచి హిట్టర్‌గా పేరుంది. భారీ కాయంతో బలంగా ఉండే అతణ్ని స్నేహితులు 'భీమ్‌' అని పిలుస్తుంటారు.

ఈ ఎంపిక కోసం చాలా ఎదురుచూశామంటూ తమ కృతజ్ఞతలు ట్విట్టర్ ద్వారా తెలుపుకున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాణించేందుకు కష్టపడతానంటూ విక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క అవకాశం చాలు నేనేంటో నిరూపిస్తా అని మంజూర్ ధర్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 10:11 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+