Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడినా మెయిన్ మ్యాచ్‌లకు అర్హత సాధించిన కోల్‌కతా

Somerset beat Knight Riders by 11 runs
గత మూడు రోజులగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఛాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు రాత్రి జరిగిన చాంపియన్స్ లీగ్ క్వాలిఫయింగ్‌లో మ్యాచ్ ఉత్కంఠను రేపింది. ఈ మ్యాచ్‌లో సోమర్సెట్ 11 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది.నెట్ రన్ రేట్ కోల్ కత్తా నైట్ రైడర్స్‌కు అధికంగా ఉండడంతో మెయిన్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది.

మ్యాచ్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే క్వాలిఫై అయ్యేందుకు కావాల్సిన 153 పరుగులు సాధించటంతో కోల్‌కతా గట్టెక్కింది. రెండు విజయాలతో సోమర్సెట్ కూడా క్వాలిఫై అయింది.

ఓపెనర్‌ జోన్స్‌ (14) ఔటైన తర్వాత ట్రెగొ, వాన్‌డీర్‌మెర్వె దాటిగా ఆడారు. నైట్‌ రైడర్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వీరి జోడీ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించింది. వాన్‌డీర్‌మెర్వె (40) ఉనద్కత్‌ బౌలింగ్‌లో కల్లీస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ట్రెగొ 45 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్ధ సెంచరీ చేశాడు. సోమర్‌సెట్‌ 12.3 ఓవర్లలో వంద పరుగులు చేసింది. హిల్‌డ్రెత్‌ (13), కాంప్టన్‌ (10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) 20 పరుగుల వద్ద అనుహ్యంగా రనౌటయ్యాడు. ట్రెగొ 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటయ్యాడు. దాంతో సోమర్‌సెట్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

ఇక కోల్ కత్తా రెండో ఓవర్ తొలి బంతికే బిస్లా (8) రనౌట్‌తో మొదలు పెట్టి నైట్‌రైడర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తివారీ (23 బంతుల్లో 27; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా భారీస్కోరు చేయలేకపోయాడు. ఆదుకుంటాడనుకున్న పఠాన్ (12) బై రన్నర్ సహాయంతో పరుగెత్తినా మరోసారి విఫలమయ్యాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయం దిశగా సాగింది. అయితే ర్యాన్ టెన్ డస్కటే (31 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఒక వైపు నిలదొక్కుకొని ఆడి జట్టుకు విజయానికి చేరువ చేశాడు. షకీబ్ (9 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్సర్), భాటియా (14 బంతుల్లో 19; 1 ఫోర్) అతనికి అండగా నిలిచారు. చివర్లో విజయలక్ష్యం పెరిగిపోవడంతో కోల్‌కతా మెయిన్ డ్రాకు క్వాలిఫై కావటంపైనే దృష్టి పెట్టింది. ఆఖరి ఓవర్లో జట్టు అర్హత సాధించడంతో షారుఖ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది ఇలా ఉంటే శుక్రవారం బెంగళూరు, వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో చాంపియన్స్ లీగ్ బెంగుళూరులో ఆరంభమవుతుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+