తన వయసునే గుర్తుంచుకోలేని వ్యక్తికి.. నా రికార్డులెలా గుర్తుంటాయి: గంభీర్

ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రచురించబడిన తన ఆత్మకథ 'ది గేమ్‌ఛేంజర్'లో గంభీర్ గురించి తన అభిప్రాయాన్ని అఫ్రిదీ చెప్పాడు. గంభీర్ తన కెరీర్‌లో చాలాసార్లు గొడవలు పడ్డాడు అని అన్నాడు. కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని వృత్తిపరమైనవి అని అఫ్రిదీ పేర్కొన్నాడు. గొప్ప రికార్డులు లేనివాడు, బాగా ఆటిట్యూడ్ ఉంటుందని గంభీర్‌పై అఫ్రిదీ ఆరోపణలు చేసాడు. ఆ తర్వాత అఫ్రిదీకి గంభీర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

రికార్డులు లేవు కానీ.. ఆటిట్యూడ్ ఉంటుంది:
ఇదిలా ఉంటే.. తాజాగా షాహిద్ అఫ్రిదిపై గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల గంభీర్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి అఫ్రిది వివాస్పద వ్యాఖ్యలు చేసాడు. 'గంభీర్ ప్రవర్తనలోనే సమస్య ఉంది. అతడికి వ్యక్తిత్వం లేదు. ఐసీసీ టోర్నీలలో రికార్డులు లేవు, కానీ ఎక్కువ ఆటిట్యూడ్ ఉంది' అని అఫ్రిది అన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన గంభీర్.. అఫ్రిదికి తనదైన రీతిలో పంచ్ ఇచ్చాడు. తన వయసునే గుర్తుంచుకోలేని వ్యక్తికి.. నా రికార్డులెలా గుర్తుంటాయి అని శనివారం ఓ ట్వీట్ చేశాడు.
మోసగాళ్లతో అలాగే ప్రవర్తిస్తా:
'అతడి వయస్సే గుర్తుంచుకోలేని ఓ వ్యక్తికి నా రికార్డులెలా గుర్తుంటాయి. షాహిద్ అఫ్రిదీ నీకు ఓ విషయం గుర్తు చేస్తా. 2007 టీ20 ప్రపంచకప్ఫైనల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో గంభీర్ 54 బంతుల్లో 75పరుగులు చేశాడు. మొదటి బంతికే అఫ్రిదీ డకౌట్ అయ్యాడు. ముఖ్యమైన విషయం: మేం కప్పు గెలిచాం. అబద్ధాలు, దేశద్రోహులు మరియు అవకాశవాదుల పట్ల నా ప్రవర్తన దురుసుగానే ఉంటుంది' అని గంభీర్ ట్వీట్ చేశాడు.

2007లో వాగ్వాదం:
2007లో గువహటి వేదికగా జరిగిన వన్డేలో గంభీర్, అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో అఫ్రిదీ ఏదో అనగా గంభీర్ అతడి వైపు దూసుకెళ్లి.. కండ్లలోకి చూస్తూ గట్టిగా సమాధానమిచ్చాడు. దీంతో అఫ్రిది తగ్గాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇక తన ఆత్మకథ 'ది గేమ్‌ఛేంజర్'లో గంభీర్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పడంతో మరింత ఎక్కువైంది.

కోల్‌కతాకు రెండు టైటిల్స్:
ఓవరాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు టైటిల్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో గౌతం గంభీర్ నేతృత్వంలోని తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్.. 2014లో మరొకసారి గంభీర్ సారథ్యంలోనే ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి టైటిల్‌ను సాధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి చాంపియన్స్‌గా నిలవగా.. రెండో సారి కింగ్స్ పంజాబ్‌ను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications