హైదరాబాద్: స్పాట్ ఫిక్సింగ్‌పై టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్‌లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయి' అని శ్రీశాంత్ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.