
ఉద్దేశపూర్వకంగా బాగా ఆడలేదు:
2009లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ జరిగిన సమయంలో తమ జట్టులోని పలువురి ఆటగాళ్లు కావాలనే మ్యాచ్‌లు ఓడిపోయారని 42 ఏళ్ల రాణా నవీద్ సంచలన ఆరోపణలు చేశాడు. తాము తొలి వన్డేలో గెలిచినప్పటికీ.. మిగతా రెండు వన్డేలను కోల్పోయామన్నాడు. అందుకు అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్ కారణమన్నాడు. 'యూఏఈ వేదికగా కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయాం. తొలి వన్డేలో గెలిచినా.. మిగిలిన రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయాం. కొంతమంది ఆటగాళ్ళు ఉద్దేశపూర్వకంగా బాగా ఆడలేదు' అని పాక్ స్థానిక వార్తా ఛానెల్‌తో రానా చెప్పాడు.

యూనిస్ ఖాన్ కెప్టెన్సీనే:
'ఆ సిరీస్‌లో కుట్ర జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను దూరంగా ఉన్నా. నీపై కుట్ర జరుగుతుందనే విషయాన్ని యూనిస్‌కు చెప్పా. కానీ నన్ను కూడా కుట్రలో భాగం కావాలని కోరుకున్నారు. ఇందుకు కారణం యూనిస్ ఖాన్ కెప్టెన్సీనే. వ్యక్తిగా యూనిస్‌పై మా సీనియర్ క్రికెటర్లకు ఎవరికీ వ్యతిరేకత లేకపోయినా.. కెప్టెన్‌గా అతని వైఖరి నచ్చలేదు. కెప్టెన్ అయిన తర్వాత యూనిస్ వైఖరి మారిపోయింది. అతని వ్యక్తిత్వం, నడవడిక పూర్తిగా మారిపోయాయి. దీనిపై కొంతమంది ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. అనవసరంగా యూనిస్ తిడుతున్నాడని కూడా చెప్పారు. యూనిస్ కెప్టెన్సీలో ఆడటానికి చాలామంది ఇష్టపడలేదు' అని రాణా నవీద్ తెలిపాడు.

138 పరుగుల తేడాతో విజయం:
ఆ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌ను పాక్ 138 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లను వరుసగా 64 పరుగులు, 7 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది. ఆనాటి సిరీస్‌లో మహ్మద్ యూసఫ్, షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్, సయాద్ అజ్మల్‌లు సీనియర్ క్రికెటర్లుగా ఉన్నారు. ఇక పాకిస్తాన్ తరఫున 9 టెస్టులు, 74 వన్డేలు, 4 టీ20ల్లో నవీద్ ప్రాతినిథ్యం వహించాడు.


Click it and Unblock the Notifications












