హైదరాబాద్: ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ చేరాలంటే- గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్‌ను నిర్దేశించినప్పటికీ దాన్ని అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.
గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 186 పరుగులు భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా కొట్టి అవతల పడేశారు. 19.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. నాలుగు భారీ సిక్సర్లు, డజను ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ విశ్వరూపం ముందు- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్- 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో చేసిన 104 పరుగులు వెలవెలపోయాయి.
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య ఆరుకు చేరింది. ఓ బ్యాటర్ ఆరు సెంచరీలు చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి. ఇదివరకు వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్- ఈ అరుదైన రికార్డును సాధించాడు. తాజాగా దీన్ని సమం చేశాడు విరాట్ కోహ్లీ. గేల్-కోహ్లీ తరువాత అత్యధికంగా సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్‌పై ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. ఈ సెంచరీ- కోహ్లీ విమర్శకుల నోళ్లను మూయించిందని వ్యాఖ్యానించాడు. భారీ షాట్లు ఆడలేడంటూ అతనిపై వచ్చిన విమర్శలకు ఈ ఇన్నింగ్‌తో సమాధానం చెప్పాడంటూ 108 మీటర్ల మేర బాదిన సిక్సర్ గురించి సంజయ్ బంగర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కోహ్లీ ఐపీఎల్ కేరీర్‌లోనే అది మ్యాసివ్ సిక్సర్‌గా అభివర్ణించాడు.
విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి జాలువారిన ఓ అద్భుతమైన ఇన్నింగ్‌గా పేర్కొన్నాడు. అతను ఆడిన కొన్ని షాట్లు నమ్మదగ్గేవిగా లేవని, తన సామర్థ్యానికి మించి ఆడాడని కితాబిచ్చాడు. క్రీజ్‌లో కుదురుకున్న విధానం, బౌలర్లపై సాధించిన ఆధిపత్యం, తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగడం.. ఇవన్నీ ఒకే ఇన్నింగ్‌లో కనిపించాయని సంజయ్ బంగర్ అన్నాడు.