పాక్ సమర్థమైన ప్లాన్స్.. మిడిలార్డర్ ఫెయిల్
ఈ మ్యాచ్‌లో భారత స్కోరు 200కు పైగా కావాల్సింది. ఎందుకంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ధనాధన్ బ్యాటింగ్‌తో అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. అయితే మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం రాణించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ అన్నట్లు.. తమ వద్ద సూర్యకుమార్ యాదవ్‌ను, హార్దిక్ పాండ్యాను అడ్డుకునేందుకు పక్కా ప్లాన్సు ఉన్నాయని, వాళ్లిద్దరినీ బుట్టలో వేసుకుంటే మ్యాచ్ గెలుపు మా వైపే అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీన్ని బట్టి పాక్ సమర్థంగా ప్లాన్స్ అమలు చేసి సూర్యను, పాండ్యాను ఔట్ చేయడంతో స్కోరు తగ్గిపోయింది. పంత్ ఔటయిన విధానం చూస్తే డీకేకు బదులు ఎందుకు ఇతన్ని తీసుకున్నారా అని అనుకోని అభిమాని ఉండడు. మిడిలార్డర్ వైఫల్యాన్ని పట్టించుకోని కొందరు కేవలం అర్షదీప్ సింగ్ క్యాచ్ మిస్ మాత్రమే వాళ్లకు పెద్ద తప్పులా కన్పిస్తోంది అంటూ మండిపడుతున్నారు.
ఇవేవీ విమర్శకులకు కన్పించడం లేదా?
ఇకపోతే ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ 3.5ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి కేవలం 27పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లలో బిష్ణోయ్ మినహా ధారాళంగా పరుగులిచ్చారు. భువీ 40, హార్దిక్ పాండ్యా 44, యుజ్వేంద్ర చాహల్ 43 పరుగులిచ్చారు. అర్షదీప్ సింగ్ ఎకానమీ 7గా ఉంటే వీరి ముగ్గురి ఎకానమీ 10 నుంచి 11 మధ్య ఉంది. అంటే బౌలింగ్ విషయంలో వీళ్లతో పోల్చితే అర్షదే బాగా పడ్డట్లు. కానీ ఇవేవి విమర్శకులకు కన్పించలేదు. ఇక 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 19పరుగులు ఇచ్చాడు. మినిమం 10పరుగులు డిఫెండ్ చేసే పరిస్థితి ఉన్నా అర్ష డిఫెండ్ చేయగలిగేవాడే. కేవలం 7పరుగులను కూడా అతను డిఫెండ్ చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. భువీ వేసిన 19వ ఓవర్ వైఫల్యం గురించి మరీ ఎందుకు ప్రస్తావించట్లేదు.
ఒక్క క్యాచ్ మిస్ చేస్తే విలన్ అయిపోతాడా?
ఇక కొందరు నెటిజన్లు అర్షదీప్ మీద జాత్యాహంకార దూషణలతో కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం అర్షదీప్ పట్ల మద్దతు పలుకుతున్నారు. అర్షకు ఉన్న అనుభవం నేపథ్యంలో అతను అంత అద్భుతంగా రాణిస్తున్నా అతన్ని పట్టించుకోవట్లేదు.. కేవలం ఒక్క క్యాచ్ మిస్ చేస్తే అతను విలన్ అయిపోయాడా అంటూ మండిపడుతున్నారు. కాలీస్థానీ అంటూ అతన్ని భారత వ్యతిరేకిగా చిత్రీకరించడానికి సిగ్గుండాలి అంటూ సీరియస్ అవుతున్నారు. ఇకపోతే హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ హఫీజ్ తదితర క్రికెటర్లు సైతం అర్షదీప్ సింగ్‌కు మద్దుతునిచ్చారు.


Click it and Unblock the Notifications












