Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: ఐసీయూలో కేఎల్ రాహుల్.. రిజ్వాన్‌‌కు దండాలు.. ఇవెక్కడి మాస్ మీమ్స్‌రా నాయనా..?

Some Hilarious Memes Regarding India vs Pakistan Match

ఆసియా కప్ టోర్నీ క్రికెట్ అభిమానులకు అసలైన పసందు అందిస్తుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్‌‌‌‌ మ్యాచ్ జరిగి వారం తిరిగేలోపే మరో మ్యాచ్ జరగబోతుండడంతో ఇరు దేశాల అభిమానులకు క్రికెట్ మజా టన్నుల కొద్దీ దక్కబోతుంది. ఇరు జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్‌లు జరిగేలా టోర్నీ ప్లాన్ చేసిన ఆసియా కప్‌‌ నిర్వాహకుల పుణ్యమే ఇది. ఇప్పటికే గ్రూపు స్టేజులో ఓ రసవత్తర పోరు ఇరు జట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఇండియా గెలుపొందింది. ఇక నేడు సూపర్‌‌‑4 స్టేజులో భాగంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడడం ఖాయం. అయితే ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ముందు నెటిజన్లు పాక్ వర్సెస్ ఇండియా రైవల్రీ, తదితర విషయాలపై కామెంట్లు, మీమ్స్ హోరెత్తిస్తున్నారు.

అరే రాహుల్‌ లేరా.. నీ కోసం ఏం తెచ్చామో చూడు

గాయం నుంచి కోలుకుని భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ మునుపటి లయ అందుకోలేకపోతున్నాడు. ఈ ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన రాహుల్, హాంకాంగ్ మీద 39బంతుల్లో 36పరుగులు చేసి టెస్ట్ తలపించాడు. ఇక టాపార్డర్లో కోహ్లీ, రోహిత్, రాహుల్ రాణిస్తే ఇండియాకు ఢోకా ఉండదు. అయితే రాహుల్ మునుపటిలా జోరుగా ఆడాలనే ఉద్దేశంలో ఓ మీమర్ త్రీఇడియట్స్ మూవీని పేర్కొంటూ ఓ ఫన్నీ మీమ్ పోస్ట్ చేశాడు. ఇందులో కోహ్లీ, రోహిత్ ఐసీయూలో ఉన్న రాహుల్‌ను పరామర్శిస్తుంటారు. అరే రాహుల్ లేరా నీకోసం ఆరెంజ్ క్యాప్ (ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌కిచ్చే టోపీ) తీసుకొచ్చాం.' అంటూ ఉత్సాహపరుస్తుంటారు. ఐపీఎల్లో రాహుల్ ఎలా చెలరేగుతాడో తెలిసిందే. అందువల్ల ఆరెంజ్ క్యాప్ గుర్తు చేస్తేనన్న మళ్లీ రాహుల్ ఫామ్ పుంజుకుంటాడనే ఇన్నర్ మీనింగ్‌తో ఈ మీమ్ పోస్టు చేశారు.

చిట్టి రోబోలాగా సూర్యకుమార్ యాదవ్

ఇక ఓ మీమర్ కాంబో మీమ్స్‌తో పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామిని రిజ్వాన్ తో పోల్చుతూ ఔట్ డూ ఔట్ డూ అని అర్నాబ్ అరిచినట్లు.. రిజ్వాన్ అరవబోతున్నాడనేలా ఓ మీమ్ ఉంది. రోబో మూవీకి సంబంధించిన ఓ క్లిప్‌లో చిట్టి గన్స్ అన్నింటినీ పేర్చి 360 డిగ్రీలో కాల్పుల మోత మోగిస్తుంది కదా.. దాన్ని సూర్యకుమార్‌కు ఆప్ట్ చేస్తూ మిస్టర్ 360 తన షాట్ల కోసం రెడీ అవుతున్నాడనేలా మీమ్ చేశారు. అక్షర్ పటేల్ ఎంట్రీ, అవేశ్ ఖాన్ ఎక్సిట్‌కు సంబంధించి మరో రెండు మీమ్స్ కూడా పోస్టు చేశారు.

ఒరే రిజ్వానూ నీకో దండంరా !

ఇక మరో మీమర్ రిజ్వాన్ ఎక్స్ ట్రా అప్పీలు గురించి కూడా పోస్టు చేశాడు. ఒరే రిజ్వాను నీకో దండంరా అనేలా బ్యాటర్లు, అంపైర్లు అతనికి దండం పెడుతున్నట్లు పోస్టు చేసిన ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రిజ్వాన్ ఎంత ఘోరంగా అప్పీల్స్ చేశాడో అందరం చూశాం. మరో నెటిజన్ అవేశ్ ఖాన్ ఫీవర్ గురించి మీమ్ పోస్ట్ చేశాడు. మరో పోస్టులో మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఓ మీమ్ పోస్ట్ చేశాడు. ఇందులో జాఫర్ ఆసియా కప్ ఆర్గనైజర్స్‌నుద్దేశించి స్పందించాడు. ఎన్ని ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నార్థకాన్ని ఆశ్చర్యకరంగా ఉండేలా చేశాడనే ఉద్దేశంలో ట్వీట్ చేశాడు. ఇందులో ఓ వెస్టిండీస్ ప్లేయర్ బ్యాటింగ్ నంబర్ 3 స్థానంలో వచ్చి 2 సైగ చూపిస్తాడు. దీన్ని బట్టి ఆసియా కప్ ఆర్గనైజర్స్ ఇంటెన్సన్స్ రెండు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎలాగోలా జరగాలి.. అలాగే ఫైనల్‌తో కలిపి మూడు జరగాలనేది ప్లాన్ అని తెలుస్తోంది అన్నట్లు జాఫర్ మీమ్ పోస్ట్ చేశాడు.

Story first published: Sunday, September 4, 2022, 17:30 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+