బ్యాట్స్‌మెన్‌వైపు అసభ్యకర సంజ్ఞలు: వీడియో వైరల్, జరిమానా

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) అనుచితంగా వ్యవహరించిన పాకిస్థాన్ పేసర్ సొహైల్ తన్వీర్‌కు జరిమానా పడింది. టోర్నీలో భాగంగా గురువారం గయానా అమెజాన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సొహైల్ తన్వీర్ హద్దుమీరి ప్రవర్తించాడు.
సెయింట్ కిట్స్ జట్టు తరఫున ఆడుతున్న బెన్ కటింగ్‌ను బౌల్డ్ చేసిన తర్వాత క్రీజులో ఉన్న బెన్ కటింగ్‌వైపు రెండు చేతి వేళ్లతో అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. ఈ సంఘటన తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం లైవ్‌లో ప్రసారం కావడంతో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
దీనిని తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఇదే లీగ్‌లో ట్రిబాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్‌లిన్ బ్యాట్స్‌మన్ ఔటైన తర్వాత సొహైల్ వ్యవహరించిన తీరును ఖండించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications