సోహైల్ టు భువనేశ్వర్: డ్వేన్ బ్రావోదే ఇప్పటి వరకు రికార్డ్
ముంబై: క్రికెట్‌ను బ్యాట్సుమెన్ ఆటగా భావిస్తాము. క్రికెట్ అంటే బ్యాట్సుమెన్ ఆధిపత్యం కనిపిస్తుంటుంది. అనేక ఏళ్లుగా క్రికెట్ రూల్స్ కూడా బ్యాట్సుమెన్‌కు ఓ విధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి.
వందేళ్ల క్రితమే ప్రముఖ డబ్ల్యుజీ గ్రేస్ బ్యాటింగ్‌కు ఉన్న అధిక ప్రాధాన్యత గురించి చెప్పారు. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు కూడా అదే ధోరణిలో ఉంటారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. అభిమానులు కూడా బౌలింగ్ కంటే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసేందుకే వస్తారు. లేదా ఆసక్తి చూపిస్తారు.
ట్వంటీ 20 క్రికెట్ విషయానికి వస్తే, బౌలర్ల్ పరిస్థితి అలాగే ఉంది. అందరి దృష్టి బ్యాట్సుమెన్ పైకి వెళ్తుంది. గత తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో బౌలర్ల కంటే బ్యాట్సుమెన్ ఆధిపత్యమే కనిపించింది.
అదే సమయంలో బౌలర్లను పూర్తిగా తీసిపారేశారని చెప్పలేం. గత కొన్నేళ్లుగా బౌలర్లు తమ ప్రతిభతో బ్యాట్సుమెన్ ప్రాధాన్యతను పక్కకు తప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు బౌలర్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ ఇస్తున్నారు. ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభమైనప్పటి నుంచి దీనిని ఇస్తున్నారు.
ఐపీఎల్ 1లో సోహైల్ తన్వీర్ తన ప్రతిభతో పర్బుల్ క్యాప్ అందుకున్నాడు. గత సీజన్లో భువనేశ్వర్ కుమార్ అందుకున్నాడు.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఎక్కువసార్లు పర్బుల్ క్యాప్ అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. అతను 2013, 2015లో దీనిని అందుకున్నాడు. 2013లో అతను 32 వికెట్లు తీశాడు. పర్బుల్ క్యాప్ అందుకున్న వారిలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసింది బ్రావోనే. 2013లో 32 వికెట్లు తీశాడు.
ఆర్పీ సింగ్ 2009లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఓ భారతీయ బౌలర్ ఇది దక్కించుకోవడం అదే తొలిసారి. ఆ తర్వాత ప్రజ్ఞాన్ ఓఝా (2010), మోహిత్ శర్మ (2014), భువనేశ్వర్ కుమార్ (2016)లో అందుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్
సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ 2016లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అతను 17 మ్యాచులలో 23 వికెట్లు తీశాడు. గత ఐపీఎల్‌లో హైదరాబాద్ దూసుకెళ్లడం వెనుక భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు.

డ్వేన్ బ్రావో
చెన్నై సూపర్ కింగ్స్ (రద్దయిన) తరఫున ఆడిన డ్వేన్ బ్రావో 2015లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇతను వెస్టిండీస్ ఆల్ రౌండర్. రెండేళ్ల క్రితం జరిగిన ఐఫీఎల్లో ఇతను 17 మ్యాచులు ఆడి 26 వికెట్లు తీశాడు. ఇది అతనికి రెండో పర్పుల్ క్యాప్.

మోహిత్ శర్మ
ఇండియన్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ 2014లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అతను అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. 16 మ్యాచుల్లో 23 వికెట్లు తీశాడు.

బ్రావో
ఐపీఎల్లో డ్వేన్ బ్రావో కీలక క్రికెటర్. అతను ప్రతి ఎడిషన్లో అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. 2013లో తొలిసారి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అతను 18 మ్యాచుల్లో 32 వికెట్లు తీశాడు.

మోర్నో మోర్కెల్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్ 2012లో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అతను అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆఢాడు. 16 మ్యాచుల్లో 25 వికెట్లు తీశాడు.

లసిత్ మలింగ
శ్రీలంక బౌలర్ అయిన లసిత్ మలింగ ఐపీఎల్ బెస్ట్ బౌలర్లలో ఒకడు. ఐపీఎల్ టోర్నెమెంటులో అత్యధిక వికెట్లు (147) తీశాడు. ఇతను 2011లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు. 16 మ్యాచుల్లో 28 వికెట్లు తీశాడు.

ప్రగ్యాన్ ఓఝా
డక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన ప్రజ్ఞాన్ ఓఝా 2010లో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అతను 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. దీనిని దక్కించుకున్న రెండో ఇండియన్ బౌలర్.

ఆర్పీ సింగ్
ఆర్పీ సింగ్ 2009లో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇతను కూడా డక్కన్ ఛార్జర్స్ తరఫునే దీనిని అందుకున్నాడు. 16 మ్యాచుల్లో 23 వికెట్లు తీశాడు.

సౌహైల్ తన్వీర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్.. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే పర్బుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. 11 మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications