Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్సీకి గుడ్ బై: ధోని నిర్ణయంతో ఆనందించేదెవరో తెలుసా?

హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం తమదైన శైలిలో హాస్యచతురత ప్రదర్శించారు. సరదా కామెంట్లు, నవ్వు పుట్టించే ఫొటోలతో పోస్టులు పెట్టారు.

కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పినట్లు ప్రకటన రాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లలో చాలా మంది సరదాగా స్పందించారు. కొంతమంది మాత్రం విభిన్నంగా ఆలోచించి ధోని ఆకస్మిక నిర్ణయంతో ఎక్కువగా సంతోషపడేది మాత్రం యువరాజ్‌సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ అని ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు.

భారత్‌ జట్టు ఆడిన పలు సిరీస్‌లకు తన తనయుడు యువరాజ్‌సింగ్‌ను ధోని కావాలనే ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడని గతంలో యోగ్‌రాజ్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని సంచలన నిర్ణయంతో ఆనందపడేది యువీ తండ్రి యోగ్‌రాజ్‌ అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు.

ధోని నిర్ణయంతో ఎక్కువగా సంతోషపడేది యువీ తండ్రి యోగ్‌రాజ్‌

ధోని ఆకస్మిక నిర్ణయంతో ఎక్కువగా సంతోషపడేది మాత్రం యువరాజ్‌సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ అని ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు.

డీమహిటైజేషన్

కెప్టెన్‌ గా ధోని రిటైరయ్యాడు. దేశంలో డీమానిటైజేషన్‌ తర్వాత ‘డీమహిటైజేషన్'‌ మొదలైంది.

ధోని భార్య సాక్షిని కెప్టెన్‌ పగ్గాలు

ఇదే తమిళనాడులో అయితే కోహ్లితో సహా టీమిండియా ఆటగాళ్లు అందరూ ధోని భార్య సాక్షిని కెప్టెన్‌ పగ్గాలు చేపట్టమని బతిమాలేవారు.

రైనా భార్య: ఇప్పుడు ధోని కెప్టెన్‌ కాదు

సురేశ్‌ రైనా: అయితే నీ భర్త కూడా ఇప్పుడు క్రికెటర్‌ కాదు

ధోనికి కృతజ్ఞతలు

రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్, మోహిత్ శర్మ ఇలా

రోహిత్‌ శర్మ కూడా తప్పుకోవాలి

కెప్టెన్సీ నుంచి ధోని నిర్ణయించుకున్నాడు. రోహిత్‌ శర్మ కూడా తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

జట్టు ప్రయోజనాల కోసం ధోని తప్పుకున్నాడు

జట్టు ప్రయోజనాల కోసం ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు. పార్టీ కోసం ములాయం సింగ్‌ యాదవ్‌ తప్పు కోవడం లేదు!

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+