For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘So Proud of You My Love’: కోహ్లీని ట్యాగ్‌ చేస్తూ అనుష్క ట్వీట్‌

‘So Proud of You My Love’: Anushka After Series Win in Australia

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్ నెగ్గిన టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డేలో గెలిచి.. ఆసీస్ పర్యటనలో మూడు సిరిస్‌ల్లోనూ టీమిండియా అజేయంగా నిలిచింది. దీంతో టీమిండియాపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కూడా కోహ్లీ సేనను పొగడ్తలతో ముంచెత్తారు. ఆస్ట్రేలియా పర్యటన మ‌రువ‌రానిద‌ని, అసాధార‌ణంగా సాగింద‌ని అనుష్క త‌న ట్వీట్‌లో తెలిపింది. "మరుపురాని, అద్భుతమైన పర్యటన ఇది. టీమిండియా చారిత్రక విజయాలను ప్రత్యక్షంగా చూసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరికీ అభినందనలు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మై లవ్‌" అని విరాట్‌ కోహ్లీని ట్యాగ్‌ చేస్తూ అనుష్క ట్వీట్‌ చేసింది.

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత జరిగిన టీ20 సిరిస్‌‌ను 1-1తో సమం చేయగా... నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరిస్ ను సైతం2-1తో సొంతం చేసుకుని తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను నెగ్గింది.

Story first published: Saturday, January 19, 2019, 13:12 [IST]
Other articles published on Jan 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+