ముంబై: పలు బాలీవుడ్, టాలీవుడ్‌లో చిత్రాల్లో నటించిన స్నేహా ఉల్లాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎందుకంటే ఆమె వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, మరో ఆటగాడు డ్వేన్ బ్రావోతో కలిసి పార్టీ చేసుకుంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి బాగా పాపులరయ్యాయి.
పార్టీలంటే ఎప్పుడూ ముందుండే క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్ కలిసి పార్టీ చేసుకున్నాడు. కాగా, పార్టీలో డ్వెయిన్, స్నేహా ఉల్లాల్‌లతో కలిసి సెప్టులు కూడా వేశాడు.

ఇదే పార్టీలో బ్రావో తన 'ఛాంపియన్'అనే పాటను కూడా ఆవిష్కరించాడు. ఈ విషయాన్ని స్నేహా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఫొటోలు పోస్ట్ చేసింది.
కాగా, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్.. ఆ తర్వాత సింహా, కరెంట్, మడత కాజా సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ మరోసారి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Look at @chrisgayle333 being all cute last night . We danced and chatted .Such a cool person.Best of luck for tomorrows match .#partywithsportz #westindiescricket #champion
Posted by Sneha Ullal onMonday, March 14, 2016
Danced and Partied with the #westindiescricket team tonight. @djbravo47 launched his new song #champion .So groovy So...
Posted by Sneha Ullal onMonday, March 14, 2016