న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రాక్టీసు చేస్తుండగా అనుకోని అతిథిగా పామొచ్చింది(వీడియో)

Snake Invades England Cricket Teams Practice Session

న్యూ ఢిల్లీ: ఓవైపు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. మరోవైపు అనుకోని అతిథి దర్శనమిచ్చింది. ఓ విషపూరిత పాము వాళ్ల క్యాంప్‌లో దూరింది. ఈ పామును ఇద్దరు వ్యక్తులు అదుపు చేస్తున్న సమయంలో తీసిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 'ఈ రోజు శిక్షణలో ఉండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది.' అంటూ 12సెకన్ల పాటు ఉన్న వీడియో ఒకటి ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.

ఆ వీడియోలో పామును ఓ పైపులోకి ఎక్కించేందుకు ముగ్గురు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన సిబ్బంది ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఐదు వన్డేలు, మూడు టెస్టులు, ఒక టీ20 సిరీస్ కోసం శ్రీలంక టూర్‌కు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ ఇద్దరి మధ్య డంబుల్లాలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో వన్డేకు కూడా వరుణుడు అడ్డు పడినా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌లో 31 పరుగులతో గెలిచింది. కెప్టెన్ మోర్గాన్ 92 పరుగులతో రాణించాడు. ఇప్పుడు మూడో వన్డే కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.

ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లకు తొమ్మిది వికెట్లు నష్టపోయి 278పరుగులు చేయగలిగింది. జట్టు మొత్తంలో ఇయోన్ మోర్గాన్ 11 ఫోర్లు, రెండు సిక్సులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ దశలో జట్టు కెప్టెన్ జోయ్ రూట్ 71పరుగులు చేశాడు. 29 ఓవర్ల వద్ద వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగుల వద్ద మ్యాచ్‌ను రద్దు చేశారు.

Story first published: Monday, October 15, 2018, 16:07 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X