
మహిళల ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్ధం అవుతోంది. వుమెన్స్ ప్రీమియార్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు భారీ మొత్తం చెల్లించి జట్టులోకి తీసుకుంది. ఆమె కోసం ఏకంగా రూ.3.4 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో తొలి డబ్ల్యూపీఎల్ వేలంలో అందరి కన్నా ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. వచ్చే నెలలో జరిగే డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఆర్సీబీ జట్టుకు ఆమెనే కెప్టెన్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆమెతోపాటు ఎలీస్ పెర్రీని కూడా ఆర్సీబీ కొనుగోలు చేసింది.
దీంతో వీళ్లిద్దరిలోనే ఒకరిని కెప్టెన్ చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. పురుషుల ఐపీఎల్‌లో ఆర్సీబీ కీలక ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇద్దరూ కలిసి.. స్మృతిని ఆర్సీబీ కెప్టెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుల్ అవుతున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం కెప్టెన్ ఎవరు అయినా సరే తాము మాత్రం ఎలీస్ పెర్రీనే చూస్తామని తేల్చిచెప్పారు. ఆమెకు కూడా ఆర్సీబీ భారీ మొత్తమే చెల్లించింది.
డబ్ల్యూపీఎల్ వేలంలో స్మృతి మంధాన కోసం గట్టిపోటీ నెలకొంది, చివరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆమె కోసం చివరి వరకు పోరాడారు. కానీ కనీ వినీ ఎరుగని రితీలో భారీ మొత్తాన్ని చెల్లించిన ఈ ఫ్రాంచైజీ.. తమ జట్టులోకి ఆమెను తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెను జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించిన ఆర్సీబీ.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఆమె అయినా ఆర్సీబీకి కప్పు అందిస్తుందేమో వేచి చూడాలి.