భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా.. స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం వల్ల వాయిదా పడింది. పెళ్లి వాయిదా పడిన కొద్ది రోజుల్లోనే, స్మృతి మంధాన సోషల్ మీడియాలో పలాష్‌తో ఉన్న తమ ఫోటోలు, పెళ్లికి సంబంధించిన పోస్టులను తొలగించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. పలాష్ ముచ్ఛల్ ఒక కొరియోగ్రాఫర్‌తో ఫ్లర్టీ మెసేజ్‌లు పంపుకున్నట్లుగా భావిస్తున్న కొన్ని స్క్రీన్ షాట్‌లు వైరల్ అయ్యాయి. దీనితో పెళ్లి వాయిదాకు అసలు కారణం పలాష్ నమ్మకాన్ని కోల్పోయాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పెళ్లి వాయిదా వార్తలు, పుకార్ల మధ్య భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె పురుష సమాజాన్ని నిలదీశారు. పరోక్షంగా పలాష్ ముచ్చల్ ను మోసగాడిగా అభివర్ణించారు.
స్మృతి-పలాష్ వివాదంలోకి ఆర్జే మహవాష్ ఎంట్రీ
స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పుడు.. తెరవెనుక ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేదు. అప్పటి నుంచి అనేక పుకార్లు హల్చల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల్ చాట్‌లు వైరల్ అయ్యాయి. పలాష్ బాగోతం గురించి స్మృతి మంధానకు తెలియడంతో పెళ్లిని రద్దు చేసుకుందని నెట్టింట వార్తలు వినిపించాయి. నిజం ఎవరికీ తెలియకపోయినా ఈ మొత్తం వివాదంలో ఇప్పుడు ఆర్జే మహవాష్ ప్రవేశించారు. ఆర్జే మహవాష్ తన వీడియోలో ఇలా అన్నారు. "నా వాడే (బాయ్‌ఫ్రెండ్/భర్త) వేరే అమ్మాయికి మెసేజ్ చేస్తే, నేను ఆ స్క్రీన్ షాట్‌లను పబ్లిక్ చేసేస్తాను." అని పేర్కొన్నారు.

ఆర్జే మహవాష్ వీడియోలో ఏముంది?
మహవాష్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడుతూ.. "మగవాళ్లు చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు అడిగినా సింగిల్‌గానే ఉంటారు. నేను ప్రపంచంలో ఎవరినీ నమ్మను. ఈ వ్యక్తి ఎవరినీ అలా చేయలేడు అని చెప్పలేను. ఎవరైనా ఏదైనా చేయవచ్చు అని ఆమె తన వైవాహిక జీవితంపై నమ్మకాన్ని కోల్పోయినట్లుగా వ్యాఖ్యానించారు. ఇది ఆమె వ్యక్తిగత అనుభవాన్ని లేదా ప్రస్తుత వివాదంపై ఆమె ఆలోచనను ప్రతిబింబిస్తుంది. తన బాయ్‌ఫ్రెండ్/భర్త ఎవరితోనైనా DM (డైరెక్ట్ మెసేజ్) లలో ఫ్లర్ట్ చేస్తే, ఆ అమ్మాయిలు తనకు స్క్రీన్ షాట్‌లు పంపాలని, తాను వాటిని పబ్లిక్ చేస్తానని ఆమె సంచలన హెచ్చరిక చేశారు. దీని ద్వారా మోసం చేసేవారికి బహిరంగంగా గుణపాఠం చెప్పాలని ఆమె ఉద్దేశించినట్లు కనిపిస్తుంది. ఆమె వివాహం గురించి ప్రస్తావిస్తూ పెళ్లి సమయంలో ఆమె తన భర్తను ఒక వారం ముందు ఇంటర్నెట్‌లో లాంచ్ చేస్తానని, అంటే బహిరంగంగా అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. తన వ్యాఖ్యల ద్వారా, భార్యలు తమ భాగస్వాములను గుడ్డిగా నమ్మకూడదని, మోసం బయటపడినప్పుడు బాధిత మహిళలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చినట్లుగా ఉంది. ఈ వీడియోకు లక్షా పాతిక వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ల వర్షం కురిసింది.
పలాష్-స్మృతి పెళ్లి వ్యవహారం?
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌ల వివాహం వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి ఆసుపత్రిలో చేరడం వల్ల పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. స్మృతి, పలాష్‌తో తన పెళ్లికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులన్నిటినీ తొలగించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఈలోగా, పలాష్ ఒక కొరియోగ్రాఫర్‌తో ఫ్లర్టీ మెసేజ్‌లు పంపుతున్నట్లు ఉన్న కొన్ని చాట్‌ల స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలాష్ సోదరి, ప్లేబ్యాక్ సింగర్ పలక్ పెళ్లి కేవలం వధువు తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగానే వాయిదా పడిందని చిన్న నోట్ ద్వారా ఊహాగానాలను శాంతపరచడానికి ప్రయత్నించారు. అయితే ఈ విషయంపై స్మృతి కానీ, పలాష్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.