టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు కావడం వెనుక అత్యంత దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై స్మృతి బాల్య మిత్రుడు విధాన మానే చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
నవంబర్ 23, 2025న మహారాష్ట్రలోని సాంగ్లీలో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. కానీ పెళ్లి రోజే ముహూర్తం ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో స్మృతి తండ్రికి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరడం వల్లే పెళ్లి వాయిదా పడిందని భావించారు. కానీ అసలు కారణం అది కాదని, పలాష్ ముచ్చల్ మోసం చేయడమేనని ఇప్పుడు తేలింది.

స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విధాన మానే ఓ ఇంటర్వ్యూలో పలాష్‌పై సంచలన ఆరోపణలు చేశారు. "పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో పలాష్ మరో మహిళతో కలిసి పడకగదిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి మేమంతా షాక్ అయ్యాం. ఆ సమయంలో అక్కడ ఉన్న భారత మహిళా క్రికెటర్లు ఆగ్రహంతో పలాష్‌ను చితకబాదారు" అని విధాన మానే వెల్లడించారు.
కేవలం స్మృతిని మోసం చేయడమే కాకుండా, పలాష్ తన దగ్గర నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేశాడని విధాన మానే ఆరోపించారు. ఒక సినిమా నిర్మిస్తానని చెప్పి పలాష్ తన దగ్గర రూ. 40 లక్షలు తీసుకున్నాడని, కానీ ఇప్పటివరకు సినిమా తీయలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. పెళ్లి రద్దు అయినప్పటి నుంచి పలాష్ తన ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని, అతను ఓ పెద్ద మోసగాడని విధాన మానే మండిపడ్డారు.
స్మృతి మంధాన కుటుంబం ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలాష్ పెళ్లి చేసుకుని సాంగ్లీలోనే స్థిరపడతాడని తాము ఆశించామని, కానీ అతని అసలు స్వరూపం బయటపడటంతో స్మృతి తండ్రి మనస్తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం స్మృతి ఈ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది.