Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన కాబోయే భర్త క్వాలిటీస్ చెప్పిన స్మృతి మంధాన.. కంట్రోల్ తప్పిన ఇషాన్ కిషన్ (వీడియో)

భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన క్రికెట్ లవర్స్‌కు సుపరిచితమే. ఆటతో పాటు తన అందంతోనూ స్మృతి అభిమానులను సంపాదించుకుంది. స్టైలిష్ షాట్లతో పరుగుల వరద పారిస్తూ గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్,ఆస్ట్రేలియాపై టీమిండియా ఉమెన్స్ జట్టు సాధించిన చరిత్రాత్మక విజయాల్లోనూ స్మృతిది ప్రధాన పాత్ర.

అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహించే ఫేమస్ ప్రోగ్రామ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి స్మ‌ృతి మంధాన తాజాగా వెళ్లింది. ఈ ప్రోగ్రామ్‌లో స్మ‌ృతి చెప్పిన కబుర్లు వైరల్‌గా మారాయి. తాను క్రికెటర్‌గా కావడానికి గల కారణాలు వివరించింది. అలాగే తన కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్, రైట్ హ్యాండర్ అయిన తాను లెఫ్ట్ హ్యాండర్‌గా ఎలా మారిందనే ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ప్రోగ్రామ్‌కు టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ కూడా స్మృతితో కలిసి వెళ్లాడు.

Smriti Mandhana told her future husbands qualities. After that Ishaan Kishan couldnt stop laughing

కాగా, ఈ కార్యక్రమంలో ఓ అభిమాని నుంచి స్మృతి మంధాన ఓ ఆసక్తికర ప్రశ్న ఎదుర్కొంది. ' కాబోయే భర్తలో మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని చూస్తారు' అని అభిమాని అడిగాడు. దానికి స్మృతి మంధాన ఏం చెప్పాలో తెలియక కాసేపు సిగ్గుపడింది. తన పక్కన కూర్చున్న ఇషాన్ కిషాన్ నవ్వును కంట్రోల్ చేయసుకోలేకపోయాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్ షాకింగ్‌గా రియాక్ట్ అవుతూ.. 'నీకు పెళ్లి అయిందా' అని.. క్వశ్చన్ అడిగిన అభిమానిని ప్రశ్నించాడు.

అయితే స్మ‌ృతి మంధాన ప్రశ్నకు బదులిచ్చింది. ''ఇలాంటి ప్రశ్న అడుగుతారని అసలు ఊహించలేదు. మంచి అబ్బాయి అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే కేరింగ్‌గా ఉండాలి, క్రికెట్‌ను అర్థం చేసుకోవాలి. ఈ రెండు క్వాలిటీస్ అతడిలో పక్కా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిగా అతడికి నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. అతడు నా పరిస్థితిని, ఆటను అర్థం చేసుకోవాలి. నా కాబోయే భర్తలో ఈ లక్షణాలను ముఖ్యంగా చూస్తాను'' అని స్మ‌‌‌ృతి మంధాన చెప్పింది.

''మా నాన్న, నా సోదరుడు క్రికెటర్లు. అయితే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అవకాశం మా తండ్రికి దక్కలేదు. కాబట్టి తన పిల్లలను క్రికెటర్లను చేయాలని మా నాన్న నిర్ణయించుకున్నాడు. ఒకరినైనా దేశం తరపున టీమిండియాలో చూడాలనుకున్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ గురించి విన్నాను. ఇక మా బ్రదర్‌తో కలిసి ప్రాక్టీస్‌కు వెళ్లేదానిని. నెట్స్‌లో అతడి వెనుక నిలబడి చూస్తూ బ్యాటింగ్ నేర్చుకున్నా. అయితే అతడు లెఫ్ట్ హ్యాండర్, నేను కుడిచేతి వాటం బ్యాటర్‌ని. అతడిని చూస్తూ బ్యాటింగ్ నేర్చుకోవడంతో లెఫ్ట్ హ్యాండర్‌గా మారిపోయా'' అని స్మృతి మంధాన వివరించింది.

Story first published: Wednesday, December 27, 2023, 14:05 [IST]
Other articles published on Dec 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+