న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG W vs IND W 2nd T20I: చిచ్చురేపి మ్యాచ్ వన్ సైడ్ చేసిన స్మృతి మంధాన.. ఇంగ్లాండ్‌ వుమెన్స్‌పై ఘన విజయం

Smriti Mandhana Speedy Half Century Helps India womens Victory Against England Womens in 2nd T20I

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన నాక్‌ ఆడడంతో డెర్బీలో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలుపొందింది. తద్వారా సిరీస్ 1-1తో సమం అయింది. 143పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మంధాన ధాటిగా ఆడి.. మ్యాచ్ వన్ సైడ్ చేసేసింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో 17ఏళ్ల ఫ్రెయా కెంప్ (51) ధాటిగా ఆడింది. టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలు అయిన మహిళా క్రికెటర్‌గా కూడా ఫ్రెయా కెంప్ నిలిచింది. ఇక ఆమె ఇన్నింగ్స్ వల్ల ఇంగ్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 142పరుగులు చేసింది. అయితే ఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ ఏమాత్రం తగ్గలేదు. భారత ఓపెనర్ మంధాన 36బంతుల్లో ఫిఫ్టీ చేయడంతో పాటు (79నాటౌట్ 13ఫోర్లు) చివరి వరకు నిలిచి ఉండడంతో భారత్ 2వికెట్లు కోల్పోయి 16.4ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక ఛేదనలో ఓపెనర్లు మంధాన, షఫాలీ వర్మ (20) కలిసి 55పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ అందించారు. షఫాలీ ఔటయ్యాక దయాళన్ హేమలత (9) త్వరగానే ఔటయింది. ఇక తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (29నాటౌట్)తో కలిసి మంధాన విజయ లాంఛనాన్ని ముగించింది. ఇక ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మంధానను వరించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'మేము తొలి మ్యాచ్ ఓడాక మరింత పటిష్టంగా కమ్ బ్యాక్ అయ్యి సిరీస్‌ను సమం చేయాలని కోరుకున్నాం. నేను తప్పకుండా విజయానికి నా వంతు పాత్ర పోషించగలను అనుకున్నాను. అది జరగడంతో సంతోషంగా ఉన్నా. ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ చేయడానికి మంచి వాతావరణం ఉంది. కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు నేను నా టచ్ కనుగొన్నా. టీ20క్రికెట్‌లో ఏ జట్టుకైనా మంచి ఓపెనింగ్ కీలకం.' అని మంధాన చెప్పింది.

తుది జట్లు :
ఇంగ్లాండ్ వుమెన్స్ ప్లేయింగ్ 11 : సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, ఆలిస్ క్యాప్సే, అమీ జోన్స్ (కెప్టెన్ & వికెట్ కీపర్), మైయా బౌచియర్, బ్రయోనీ స్మిత్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, సారా గ్లెన్, ఫ్రెయా డేవిస్, లారెన్ బెల్
ఇండియా వుమెన్స్ ప్లేయింగ్ 11 : స్మృతి మంధాన, షఫాలి వర్మ, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రాధా యాదవ్, రేణుకా సింగ్

Story first published: Wednesday, September 14, 2022, 8:57 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X