INDw vs SLw: భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఏడో భారతీయ ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక నేడు(ఆదివారం) జరుగుతున్న మ్యాచ్‌లో స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది. స్మృతి మంధాన కంటే ముందు మిథాలీ రాజ్(232), ఝులన్ గోస్వామి(204), హర్మన్ ప్రీత్ కౌర్(144), అంజుమ్ టోప్రా(127), అమిత శర్మ(116), దీప్తి శర్మ(104) ఈ ఘనతను సాధించారు.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా 4వ మ్యాచ్ శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన శ్రీలంకతో తన కెరీర్‌లో 100వ వన్డే ఆడుతోంది. కానీ స్మృతి మంధాన 100వ వన్డేలో గుర్తుండిపోయేలా రాణించలేదు. స్మృతి మంధాన 28 బంతుల్లో 18 పరుగులు చేసి ఔట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో ఆమె బ్యాట్ నుంచి 3 ఫోర్లు వచ్చాయి. శ్రీలంక, దక్షిణాఫ్రికా పాల్గొంటున్న ఈ ముక్కోణపు సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై 9 వికెట్లతో గెలుపొందింది. అనంతరం దక్షిణాఫ్రికాపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..
232- మిథాలీ రాజ్
204- ఝులన్ గోస్వామి
144 - హర్మన్‌ప్రీత్ కౌర్
127-అంజుమ్ చోప్రా
116- అమిత శర్మ
104- దీప్తి శర్మ
100*- స్మృతి మంధాన
స్మృతి మంధాన అంతర్జాతీయ కెరీర్
28 ఏళ్ల స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున 7 టెస్టులు, 99 వన్డేలు, 148 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో స్మృతి మంధాన 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 629 పరుగులు చేసింది. వన్డేల్లో 10 సెంచరీలు, 30 అర్థ సెంచరీలతో 4306 పరుగులు చేసింది. టీ20ల్లో 30 అర్థ సెంచరీలతో 3761 పరుగులు చేసింది. స్మృతి మంధాన 100 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్ గా రికార్డును సాధించింది. ఈ జాబితా స్మృతి మంధాన కంటే ముందు.. బెలిండ క్లార్క్(4556), మెగ్ లాన్నింగ్(4463) ఉన్నారు.