విరాట్‌లా ఫినిష్ చేస్తా.. కానీ అతనితో పోలిక వద్దు: స్మృతి మంధాన

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మధ్య కొన్ని ఆసక్తికర పోలికలు కనిపిస్తాయి. ఇద్దరి జెర్సీ నెంబర్లు (18) ఒకటే. ఇద్దరి బౌలింగ్ శైలి(రాంగ్ ఫూట్) కూడా ఒకేలా ఉంటుంది. ఫీల్డ్ లోపలా, బయట సహచరులతో సరదాగా ఉంటారు. బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉన్నా దూకుడుగా ఆడుతారు. అతనిలానే టీమ్‌లో మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకుంది స్మృతి.

అయితే ఇదే విషయాన్ని ఆమె ముందుంచితే.. కోహ్లీతో తనకు పోలిక వద్దంటోంది. మహిళల జట్టులో స్మృతి మంధానగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నానంటోంది. భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఆటగాళ్లతో ఏ రకమైన పోలికలు కూడా తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించింది.

తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడతానని ఆమె చెప్పింది. బ్యాట్స్‌మన్‌గా విరాట్ జోరు, అతను భారత్‌ను గెలిపించిన తీరు తనకు స్పూర్తినిస్తుందని చెబుతోంది. కోహ్లీ తరహాలో మ్యాచ్‌లు గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నా ఫ్యామిలీ కలే..

నా ఫ్యామిలీ కలే..

మహారాష్ట్రలోని సాంగ్లీవంటి చిన్న ప్రాంతంనుంచి వచ్చి భారత క్రికెటర్‌గా ఎదగడాన్ని తాను గర్వంగా భావిస్తానని స్మృతి చెప్పింది. తాను క్రికెటర్‌ కావాలని తల్లిదండ్రులు ఎంతో కోరుకొని అండగా నిలిచారని... సోదరుడు శ్రవణ్‌ సహకారంతో బ్యాట్‌ పట్టి ఆటలోకి ప్రవేశించినట్లు స్మృతి గుర్తు చేసుకుంది. ‘చిన్నప్పుడు మా అన్నయ్య శ్రావణ్‌తో కలిసి ఆడేదాన్ని. అతడిని అనుకరిస్తూ తనతో పాటు బ్యాటింగ్ చేసేదాన్ని. క్రికెట్‌పై అలా ఆసక్తి మొదలైంది. 15,16 ఏళ్ల వయసులో మహారాష్ట్ర తరఫున సెంచరీ సాధించా. అప్పుడే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా. నేను భారత్‌కు ఆడాలని నా కంటే నా ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ కలగన్నారు. వాళ్లు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలిచారు.

సంగక్కర అంటే ఇష్టం...

సంగక్కర అంటే ఇష్టం...

ఆరేళ్ల కెరీర్‌లో తాను ఎంతో నేర్చుకున్నానని ఈ భారత లెఫ్టార్మ్ ఓపెనర్‌ వెల్లడించింది. ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర శైలిని అనుసరించానని చెప్పింది. ‘ఆయన బ్యాటింగ్‌ నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ కవర్‌ డ్రైవ్‌లు అద్భుతంగా ఉంటాయి. పైగా ఎడమ చేతివాటం కూడా కాబట్టి సంగక్కరను అనుకరించే ప్రయత్నం కూడా చేశాను' అంటూ తన అభిమానాన్ని ప్రదర్శించింది.

ద్రవిడ్ ఆటోగ్రాఫ్‌..

ద్రవిడ్ ఆటోగ్రాఫ్‌..

ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాక ముందు ‘ నా చెల్లెలి కోసం' అంటూ రాహుల్‌ ద్రవిడ్‌ వద్ద తన సోదరుడు ఆటోగ్రాఫ్‌ తీసుకునేందుకు ప్రయత్నించాడని... ఆయన తన సంతకం చేసి మరీ ఒక బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారని స్మృతి మధుర స్మృతులు పంచుకుంది. దానిని ముందుగా జ్ఞాపికగా ఉంచుకోవాలని భావించినా... ఆ తర్వాత పలు మ్యాచ్‌లలో దాంతోనే బ్యాటింగ్‌కు దిగినట్లు మంధాన వెల్లడించింది.

మూఢ నమ్మకాలు మాత్రం..

మూఢ నమ్మకాలు మాత్రం..

కరోనా కారణంగా సుదీర్ఘ కాలం ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని, అయితే దాని గురించి ఎప్పుడూ చింతించలేదని స్మృతి చెప్పింది. గతంలో రెండు వారాలకు మించి ఇంట్లో లేనని, ఇప్పుడు కుటుంబసభ్యులతో గడిపే అవకాశం రావడం మంచిదేనంది. అయితే సాధ్యమైనంత త్వరగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఉమెన్‌ టీ20 చాలెంజర్‌ కోసం ఎదురు చూస్తున్నానంది. తాను సినిమాలు ఎక్కువగా చూడనన్న స్మృతి... కొన్ని మూఢ నమ్మకాలు మాత్రం ఉన్నాయని చెప్పింది.

IPL 2020: టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో పతంజలి.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 12, 2020, 8:14 [IST]
Other articles published on Aug 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X