Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటలో గంగూలీనే మరపిస్తుంది: ఎవరీ స్మృతి మందాన

హైదరాబాద్: అమ్మాయిల క్రికెటర్‌ను చూసేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే అమ్మాయిల క్రికెట్‌లో వేగం ఉండదు, బలమైన షాట్లు ఉండవు, మైదానంలో నెమ్మదిగా కదులుతారు. అయితే ఈ విధంగా భావించే వారు స్మృతి మందాన (20) ఆటతీరు చూస్తే తమ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారు.

ఇంతకీ ఎవరీ స్మృతి మందాన. సౌరవ్ గంగూలీకి వీరాభిమాని అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం భారత మహిళల జట్టులో ఓపెనర్‌గా రాణిస్తోంది. తాజా మహిళల వరల్డ్ కప్‌లో స్మృతి అద్భుత ప్రదర్శన చేస్తోంది. స్మృతి ఆటలో కళాత్మక డ్రైవ్‌లు, పవర్ ఫుల్ షాట్లు ఆమె అమ్ములపొదిలోని అస్త్రాలు.

మహారాష్ట్రకు చెందిన స్మృతి మందాన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలాగే ఎడమ చేతివాటం బ్యాట్స్ ఉమన్. సౌరభ్‌ లాగే క్రీజు వదిలి ముందుకొచ్చి మిడ్‌ వికెట్‌ మీద సిక్స్‌లు కొట్టడం అంటే ఆమెకు చాలా ఇష్టం. స్మృతి మందాన కెరీర్‌లో ఎన్నో ఘనతలు ఉన్నాయి.

ముంబైలో పుట్టి పెరిగిన స్మృతి మందాన

ముంబైలో పుట్టి సంగ్లిలో పెరిగిన ఆమె తండ్రి శ్రీనివాస్‌, సోదరుడు శ్రవణ్‌ నుంచి స్ఫూర్తి పొందింది. తండ్రి శ్రీనివాస్‌, సోదరుడు శ్రవణ్‌లు జిల్లా స్థాయి క్రికెటర్లు. తొమ్మిదేళ్లకే మహారాష్ట్ర అండర్‌-15 జట్టులో చోటు సంపాదించిన ఆమె.. 11 ఏళ్లకే అండర్‌-19 జట్టులో స్థానం సంపాదించిందంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో ఊహించవచ్చు.

కుటుంబ సభ్యుల సహకారంతోనే

క్రికెట్లో స్మృతి మందాన వేసిన ప్రతి అడుగు వెనుక ఆమె కుటుంబ సభ్యుల సహకారం ఉంది. మందాన క్రికెట్‌ కార్యకలాపాలను తండ్రి చూసుకుంటే.. ఆమె డైట్‌ విషయంలో తల్లి స్మిత జాగ్రత్త పడేది. ఇక ఆమె దుస్తులు, ఇతర అవసరాలను సోదరుడు చూసుకునేవాడు.

శ్రవణ్ బౌలింగ్‌ను చితకొట్టేది

నెట్స్‌లో అందరు అమ్మాయిల్లా అమ్మాయిల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసేది కాదు. జిల్లాస్థాయి క్రికెటర్ అయిన సోదరుడు శ్రవణ్ బౌలింగ్ లో చితక్కొట్టేది. అండర్‌-19 టోర్నీలో గుజరాత్‌తో ఆడిన మ్యాచ్ లో 150 బంతుల్లో 224 పరుగులు చేసి టీమిండియాలో స్థానం సంపాదించింది.

2013లో బంగ్లాదేశపై అరంగేట్రం

2013లో బంగ్లాదేశపై వన్డే అరంగేట్రం చేసిన ఆమె, ఆసీస్ పర్యటనలో చేసిన సెంచరీతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో హోబర్ట్‌లో 109 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టులో తన చోటుని సుస్థిరం చేసుకుంది. బిగ్ బాష్ లీగ్‌లో హర్మన్ ప్రీత్ తర్వాత స్థానం సంపాదించిన భారతీయ క్రీడాకారిణిగా స్మృతి నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+