ODI rankings: అగ్రస్థానంలో స్మృతి మంధాన


హైదరాబాద్: మన దేశంలో పురుషుల క్రికెట్ తో పోల్చుకుంటే మహిళల క్రికెట్‌కు కొంచెం ఆదరణ తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ మహిళా క్రికెటర్లు పురుషులతో పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ప్రకటించిన ఐసీసీ మహిళా ర్యాంకింగ్స్‌లో మహిళా క్రికెటర్ స్మృతి మందనా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నది.
మహిళ క్రికెట్‌లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీతీ కౌర్‌లకు ఎక్కువ పాపులారిటీ ఉంది. వీరి పేర్లు తెలియని వారు ఉండరు. అయితే వీరందరిని వెనుకకు నెట్టి స్మృతి మందనా అగ్ర స్థానంలో నిలవటం గమన్హారం. మహిళల ర్యాంకింగ్స్‌లో మిథాలీరాజ్ ఐదో స్థానంలో నిలవగా హర్మన్ ప్రీతీ కౌర్ టాప్-20లో నిలిచారు.
ఇక బౌలింగ్ జాబితాలో జులాన్ గోస్వామి మూడో స్థానంలో నిలవగా దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ వరుసగా ఎనిమిది, తొమ్మిదవ స్థానంలో నిలిచారు. అలాగే టీమ్ జాబితాలో ఆసీస్ అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ రెండో స్థానంలో న్యూజిలాండ్ మీద గెలుపుతో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications