Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుక సాంగ్లీలో జరుగుతుండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. నేడు(నవంబర్ 23) నూతన దంపతులు పెళ్లి పీటలు ఎక్కడానికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్‌కు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం, గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనను వెంటనే హుటాహుటిన సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబం మొత్తం ఆయన చికిత్సపై దృష్టి సారించింది. ఈ సంఘటనతో పెళ్లి వేదికలో కలకలం చెలరేగింది. అంబులెన్స్ వేదికలోకి ప్రవేశించడంతో అతిథుల్లో ఆందోళన మొదలైంది. తొలుత పెళ్లికి వచ్చిన అతిథికి అనారోగ్యం అని వార్తలొచ్చినా.. ఆ తర్వాత స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఉన్నారని నిర్ధారణ అయింది.

విషాదకర పరిస్థితుల కారణంగా పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి మంధానా మేనేజర్ ధ్రువీకరించారు. "స్మృతి మంధానా తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. ఈ కష్ట సమయంలో దయచేసి ఊహాగానాలకు తావు ఇవ్వవద్దు. వారి గోప్యతకు భంగం కలిగించవద్దు." స్మృతి మంధాన మేనేజర్ ప్రకటించారు. స్మృతి మంధానా-పలాష్ ముచ్చల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మరో కొత్త తేదీని ప్రకటించేంత వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. వధూవరుల సన్నిహితులు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి కుటుంబ శ్రేయస్సుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, కొత్త తేదీని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు.

Smriti Mandhana Palash Muchhal Wedding Postponed After Father Suffers Health Emergency

స్మృతి-పలాష్ బంధం
2019 నుంచి ప్రేమలో ఉన్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ దురదృష్టకర సంఘటన అందర్నీ దిగ్భ్రాంతిలోకి ముంచెత్తింది. జీవితంలో ఊహించని సంఘటనలు ఎప్పుడైనా జరగవచ్చని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Story first published: Sunday, November 23, 2025, 17:25 [IST]
Other articles published on Nov 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+