చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో స్మృతి మంధాన
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త మైలురాయిని అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. శ్రీలంకతో నేడు (డిసెంబర్ 26) జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆమె మరో 28 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ కెరీర్‌లో 10,000 పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది.
మిథాలీ రాజ్ సరసన స్మృతి మంధాన
ఇండియా తరఫున ఇప్పటివరకు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ మాత్రమే 10 వేల పరుగుల మార్కును అందుకున్నారు. మిథాలీ తన సుదీర్ఘ కెరీర్లో 10,868 పరుగులు సాధించారు. ఇప్పుడు స్మృతి మంధాన ఈ రికార్డును అందుకుంటే ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళా క్రికెటర్లు (మిథాలీ రాజ్, సూజీ బేట్స్, షార్లెట్ ఎడ్వర్డ్స్) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. స్మృతి మంధాన ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవనుంది.

నేడే ఆ అరుదైన అవకాశం
శ్రీలంకతో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నేడు మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో స్మృతి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది (తొలి మ్యాచ్‌లో 25, రెండో మ్యాచ్‌లో 14 పరుగులు). అయితే, కీలకమైన మూడో మ్యాచ్‌లో ఆమె ఫామ్‌లోకి వచ్చి ఈ అద్భుత రికార్డును నెలకొల్పుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నేటి మ్యాచ్‌లో స్మృతి మంధాన ఈ ఘనత సాధిస్తే, భారత క్రికెట్ చరిత్రలో ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.
స్మృతి మంధాన అంతర్జాతీయ రికార్డులు (మొత్తం 279 మ్యాచ్‌లు):
*టెస్టులు: 7 మ్యాచ్‌ల్లో 629 పరుగులు (సగటు 57.18)
*వన్డేలు: 117 మ్యాచ్‌ల్లో 5,322 పరుగులు (సగటు 48.38)
*టీ20లు: 155 మ్యాచ్‌ల్లో 4,021 పరుగులు (సగటు 29.78)
*మొత్తం పరుగులు: 9,972
ప్రపంచ స్థాయిలో టాప్-3 మహిళా క్రికెటర్లు:
*మిథాలీ రాజ్ (భారత్): 10,868 పరుగులు
*సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 10,652 పరుగులు
*షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్): 10,273 పరుగులు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications