Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Women T20I Rankings: మంధాన, జెమీయా ర్యాంకులు మెరుగు

Smriti Mandhana, Jemimah Rodrigues make big gain in ICC Women T20I Rankings

హైదరాబాద్: కివీస్ గడ్డపై ఇటీవల జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 0-3తో భారత మహిళల జట్టు చేజార్చుకున్నప్పటికీ... ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం తమ ర్యాంకులను మరింతగా మెరుగు పరచుకున్నారు. తాజాగా మంగళవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్-10లో చోటు దక్కించుకోగా.. మిథాలీ రాజ్ 11వ స్థానంతో సరిపెట్టుకుంది.

రెండో స్థానంలో జెమీమా

రెండో స్థానంలో జెమీమా

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 765 పాయింట్లతో న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇటీవల కివీస్‌పై 132 పరుగులు చేసిన భారత ఓపెనర్ జెమీమా నాలుగు స్థానాలు పైకి ఎగబాకి 737 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక, కివీస్ గడ్డపై రెండు హాఫ్ సెంచరీలు సాధించిన స్మృతి మంధాన‌ ఆరో స్థానంలో నిలిచింది.

మూడో టీ20లో మంధాన హాఫ్ సెంచరీ

మూడో టీ20లో మంధాన హాఫ్ సెంచరీ

గత ఆదివారం జరిగిన మూడో టీ20లో మంధాన 86 పరుగులతో ఆకట్టుకుంది. అంతేకాదు గతవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రాధ యాదవ్ 18 స్థానాలు పైకి ఎగబాకి 10వ స్థానంలో నిలవగా.. దీప్తి శర్మ ఐదు స్థానాలు పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచింది.

జట్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో భారత్

జట్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో భారత్

ఆల్‌రౌండర్ జాబితాలో మాత్రం టాప్-10లో ఏ భారత క్రికెటర్ చోటు దక్కించుకోలేకపోయారు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 283 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్, వెస్టిండీస్ జట్లు టాప్-5లో కొనసాగుతున్నాయి.

Story first published: Tuesday, February 12, 2019, 18:08 [IST]
Other articles published on Feb 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+