Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దిషా పటానీని మించిన అందం: కుర్రకారు కొత్త క్రష్ స్మృతి మందాన

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు ఆడే మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. సాధారణంగా మహిళల క్రికెట్‌ను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు కదా.

మరి ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో మిథాలీ సేన మ్యాచ్‌లను ఎలా చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా! ఈ మ్యాచ్‌లను చూసేది టీమిండియా మహిళా ఓపెనర్ స్మృతి మందాన కోసమట. ఈ వరల్డ్ కప్ టోర్నీలో స్మృతి మందాన అద్భుత ప్రదర్శనకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

సౌరవ్ గంగూలీకి వీరాభిమాని

సౌరవ్ గంగూలీకి వీరాభిమాని అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం భారత మహిళల జట్టులో ఓపెనర్‌గా రాణిస్తోంది. తాజా మహిళల వరల్డ్ కప్‌లో స్మృతి అద్భుత ప్రదర్శన చేస్తోంది. స్మృతి ఆటలో కళాత్మక డ్రైవ్‌లు, పవర్ ఫుల్ షాట్లు ఆమె అమ్ములపొదిలోని అస్త్రాలు.

స్మృతి మందానది మహారాష్ట్ర

మహారాష్ట్రకు చెందిన స్మృతి మందాన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలాగే ఎడమ చేతివాటం బ్యాట్స్ ఉమన్. సౌరభ్‌ లాగే క్రీజు వదిలి ముందుకొచ్చి మిడ్‌ వికెట్‌ మీద సిక్స్‌లు కొట్టడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ముంబైలో పుట్టి సంగ్లిలో పెరిగిన ఆమె తండ్రి శ్రీనివాస్‌, సోదరుడు శ్రవణ్‌ నుంచి స్ఫూర్తి పొందింది.

2013లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం

తండ్రి శ్రీనివాస్‌, సోదరుడు శ్రవణ్‌లు జిల్లా స్థాయి క్రికెటర్లు. తొమ్మిదేళ్లకే మహారాష్ట్ర అండర్‌-15 జట్టులో చోటు సంపాదించిన ఆమె.. 11 ఏళ్లకే అండర్‌-19 జట్టులో స్థానం సంపాదించిందంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో ఊహించవచ్చు. 2013లో బంగ్లాదేశపై వన్డే అరంగేట్రం చేసిన ఆమె, ఆసీస్ పర్యటనలో చేసిన సెంచరీతో ఆకట్టుకుంది.

ఉమెన్ వరల్డ్ కప్‌లో వెస్టిండిస్‌పై అజేయ సెంచరీ

ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో హోబర్ట్‌లో 109 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టులో తన చోటుని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 90, 106, 2, 8 పరుగులు చేసింది. ప్రస్తుతం కుర్రకారు అమితంగా ఇష్టపడే జాబితాలో స్మృతి మందాన కూడా చేరింది.

దిషా పటానిని సైతం అధిగమించిన మందాన

సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ నటి దిషా పటానిని సైతం మందాన అధిగమించింది. దిషా పటాని హాట్ లుక్స్‌కు ఫిదా అయిపోయిన సినీ అభిమానులు తాజాగా మందాన చిరు నవ్వుకి పడిపోయారు. అంతేకాదు ఆమె అమాయకపు చూపులకు తమను తాము మైమరిచిపోతున్నామని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+