Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మృతి మంధాన ఆట అంటే ఎంతో ఇష్టం: 17 ఏళ్ల రేయాన్ పరాగ్

Smriti Mandhana is an inspiration for 17-year-old Riyan Parag

హైదరాబాద్: రేయాన్ పరాగ్... ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడంతో రేయాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో పిన్నవయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

రేయాన్ పరాగ్‌కు ఇది తొలి ఐపీఎల్. ఈ క్రమంలో అతడు భారత్‌కు చెందిన ఆటగాళ్లతో పాటు స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ లాంటి విదేశీ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకున్నాడు. అస్సాంకు చెందిన ఈ యువ క్రికెటర్‌కు ఇదొక గొప్ప అనుభవమే. ఈ నేఫత్యంలో తన ఐపీఎల్ అనుభవాలను ఇండియా టుడేతో పంచుకున్నాడు.

పరాగ్ మాట్లాడుతూ

పరాగ్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా రేయాన్ పరాగ్ మాట్లాడుతూ "నా తొలి ఐపీఎల్‌లో ఎంతో నేర్చుకున్నాను. ఐపీఎల్‌లో మన ఆరాధ్య క్రికెటర్లు, లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించింది. వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ గొప్ప అనుభూతి" అని చెప్పాడు. ఈ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణరీతిలో బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు.

స్మృతి మంధాన ఆట అంటే నాకు ఎంతో ఇష్టం

స్మృతి మంధాన ఆట అంటే నాకు ఎంతో ఇష్టం

మహిళల క్రికెట్‌ను తాను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని, స్మృతి మంధానకి తాను పెద్ద అభిమానినని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఆమె బ్యాటింగ్ స్టైల్‌ను కూడా తను కాపీ కొడతానని తెలిపాడు. పరాగ్ మాట్లాడుతూ "నా జీవితంలో మా నాన్నే నాకు తొలి ప్రేరణ. ఆ తర్వాత సచిన్‌, కోహ్లిలు. మహిళల క్రికెటర్లలో స్మృతి మంధాన ఆట అంటే ఎంతో ఇష్టం" అని అన్నాడు.

ఆమె బ్యాటింగ్‌ స్టైల్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటా

ఆమె బ్యాటింగ్‌ స్టైల్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటా

"ఆమె బ్యాటింగ్‌ స్టైల్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. మ్యాచ్‌లో కళ్లద్దాలు పెట్టుకుని, బీఎస్‌ బ్యాట్‌ పట్టుకొని ఆడుతున్నప్పటి నుంచి ఆమె ఆటను నేను ఫాలో అవుతున్నాను. షాట్ల ఎంపిక, క్రీజులో ఆమె కదలికలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరి క్రికెటర్ల లాగే నేను కూడా టీమిండియాకు ఆడాలని కలలు కంటున్నా" అని పరాగ్ తెలిపాడు.

Story first published: Tuesday, May 21, 2019, 15:32 [IST]
Other articles published on May 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+