ఐసీసీ అవార్డుల్లో స్మృతి మంధానకే అగ్రతాంబూలం

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన ఐసీసీ అవార్డుల్లో భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన చోటు దక్కించుకుంది. ఈ ఏడాది స్మృతి మంధాన పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చింది.
ఫలితంగా ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే, టీ20 టీమ్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా మంధాన ఎంపికైంది. స్మృతి మంధానతో పాటు మహిళా క్రికెటర్లు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శికా పాండే వన్డే టీమ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీ20 జట్టులో మంధానతో పాటు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 23 ఏళ్ల మంధాన టీమిండియా తరుపున 51 వన్డేలు, 66 టీ20లకు ప్రాతినిధ్యం వహించింది. అటు వన్డేలు, ఇటు టీ20లు కలిపి మొత్తం 3476 పరుగులు చేసింది.
అలీసా హీలేకి టీ20 క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలీసా హీలేకి టీ20 క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మ్యాచ్‌లో అలీసా హీలే(145) పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీసా పెర్రీ సొంతం చేసుకుంది.
సుత్తిరువాంగ్ ఎమర్జింగ్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఈ ఏడాది ఎలీసా పెర్రీ 73.50 యావరేజితో మొత్తం 441 పరుగులు చేయడంతో పాటు 21 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లానింగ్ వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. థాయిలాండ్‌కు చెందిన చనిదా సుత్తిరువాంగ్ ఎమర్జింగ్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది.
ఐసీసీ మహిళల వన్డే జట్టు:
1. అలిస్సా హీలీ (వికెట్ కీపర్) - ఆస్ట్రేలియా
2. స్మృతి మంధనా - భారతదేశం
3. టామ్సిన్ బ్యూమాంట్ - ఇంగ్లాండ్
4. మెగ్ లాన్నింగ్ (కెప్టెన్) - ఆస్ట్రేలియా
5. స్టాఫానీ టేలర్ - వెస్టిండీస్
6. ఎల్లిస్ పెర్రీ - ఆస్ట్రేలియా
7. జెస్ జోనాసెన్ - ఆస్ట్రేలియా
8. శిఖా పాండే - ఇండియా
9. జులాన్ గోస్వామి - ఇండియా
10. మేగాన్ షుట్ - ఆస్ట్రేలియా
11. పూనమ్ యాదవ్ - ఇండియా
ఐసీసీ మహిళల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్:
1. అలిస్సా హీలీ (వికెట్ కీపర్) - ఆస్ట్రేలియా
2. డేనియల్ వ్యాట్ - ఇంగ్లాండ్
3. మెగ్ లాన్నింగ్ (కెప్టెన్) - ఆస్ట్రేలియా
4. స్మృతి మంధాన - ఇండియా
5. లిజెల్ లీ - దక్షిణాఫ్రికా
6. ఎల్లిస్ పెర్రీ - ఆస్ట్రేలియా
7. దీప్తి శర్మ - ఇండియా
8. నిడా దార్ - పాకిస్తాన్
9. మేగాన్ షుట్ - ఆస్ట్రేలియా
10. షాబ్నిమ్ ఇస్మాయిల్ - దక్షిణాఫ్రికా
11. రాధా యాదవ్ - ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications