Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌పై భారత్ విజయం: సెంచరీతో మంధాన అరుదైన రికార్డు

Smriti Mandhana hundred helps India crush New Zealand by 9 wickets in 1st ODI

హైదరాబాద్: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 33 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన(105; 104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... రోడ్రిగ్స్‌(81 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు) సాయంతో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకుంది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 190 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్మృతి మంధాన ఓ రికార్డుని నెలకొల్పింది.

న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది. అంతేకాదు భారత్ వెలుపల స్మృతి మంధానకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

192 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్

192 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 192 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ఓపెనర్లు సుజీ బేట్స్‌(36), సోఫీ డివైన్‌(28)లు చక్కటి శుభారంభం ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్‌ పెవిలియన్‌ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లారెన్‌ డౌన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది.

70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్

70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్

దీంతో న్యూజిలాండ్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాటెర్‌వైట్‌(31), అమీలా కెర్‌(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో న్యూజిలాండ్ రేసులోకి వచ్చింది. చివర్లో హనహ్‌ రోవ్‌(25) ఫరవాలేదనిపించింది. భారత బౌలర్లలో ఏక్తాబిస్త్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో మూడు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు, శిఖా పాండేకు ఒక వికెట్‌ లభించింది.

మంధాన హాఫ్ సెంచరీ

మంధాన హాఫ్ సెంచరీ

అనంతరం న్యూజిలాండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధాన, రోడ్రిగ్స్‌లు దూకుడుగా ఆడారు. న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మంథాన సెంచరీతో మెరవగా, రోడ్రిగ్స్‌ అర్థ శతకం నమోదు చేసింది. టీమిండియా విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా మంధాన పెవిలియన్‌కు చేరింది.

Story first published: Thursday, January 24, 2019, 13:27 [IST]
Other articles published on Jan 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+