Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్మృతి మంధాన

Smriti Mandhana goes top of the ICC women’s ODI rankings

హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన‌ ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో సెంచరీతో పాటు స్మృతి మంధాన పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పెర్రీ, మెక్ లానింగ్‌‌లను వెనక్కి నెట్టి ఏకంగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో 105, రెండో వన్డేలో 90 పరుగులు చేసి మహిళల జట్టు సిరీస్‌ కైవసం చేసుకోవడంలో మంధాన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అగ్రస్థానంలో మంధాన

అగ్రస్థానంలో మంధాన

గత ఏడాది 12 వన్డేలాడి 669 పరుగులు చేసిన మంధానాకి ఐసీసీ ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. 2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకూ 15 వన్డేలాడిన ఈ భారత ఓపెనర్ రెండు సెంచరీలతో పాటు ఎనిమిది హాఫ్ సెంచరీలు సాధించింది. 751 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో మంధాన అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత పెర్రీ (681) మెక్ లానింగ్ (675) టాప్-3లో ఉన్నారు.

ఐదో స్థానానికి పరిమితమైన మిథాలీ

ఐదో స్థానానికి పరిమితమైన మిథాలీ

మరోవైపు తన కెరీర్‌లో 200 వన్డేల మైలురాయిని అందుకున్న మిథాలీ రాజ్ 669 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. మరో బ్యాట్స్‌ వుమెన్‌ జెమీమా రోడ్రిగ్జ్‌ కూడా తన ర్యాంకుని మెరుగుపరచుకుంది. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో 64 స్థానం నుంచి 61 స్థానానికి ఎగబాకింది. తొలి వన్డే 81 పరుగులు చేసి ఆకట్టుకుంది.

తన ర్యాంకుని మెరుగుపరచుకున్న జెమీమా రోడ్రిగ్జ్‌

తన ర్యాంకుని మెరుగుపరచుకున్న జెమీమా రోడ్రిగ్జ్‌

గతేడాది మార్చిలో అరంగ్రేట్రం చేసిన జెమీమా ఇప్పటికి కేవలం ఏడు వన్డేలు మాత్రమే ఆడింది. బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని 8, 9 స్థానాల్లో నిలిచారు. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పూనమ్‌ ఆరు వికెట్లు తీయగా, దీప్తి నాలుగు వికెట్లు పడగొట్టింది.

టాప్-5లో జులన్ ఒక్కటే

టాప్-5లో జులన్ ఒక్కటే

ఏక్తా బిస్త్‌ 13 స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జులన్‌ గోస్వామి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌-5 మంది బౌలర్లలో నిలిచిన ఏకైక టీమిండియా బౌలర్ జులన్ ఒక్కటే కావడం విశేషం. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 329 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Sunday, February 3, 2019, 9:26 [IST]
Other articles published on Feb 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+