Smriti Mandhana: భారత మహిళా స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సోషల్ మీడియాలో తన తాజా ఫోటోలతో సందడి చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి మంధాన.. తెల్లటి వన్-పీస్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించింది. బుగ్గపై డింపుల్, ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కష్టకాలం నుంచి కోలుకుంటున్న స్మృతి
గత నెలలో స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకలు ఎదురైన విషయం తెలిసిందే. పలాష్ ముచ్చల్‌తో వివాహం రద్దయిందని స్వయంగా స్మృతి మంధాన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ వార్త అభిమానులను కొంత ఆందోళనకు గురిచేసింది. అయితే కష్టకాలం నుంచి ఆమె వేగంగా కోలుకుంటోంది. "క్రికెట్టే నా సర్వస్వం, నా మొదటి ప్రేమ" అని ఆమె ఇటీవల పేర్కొంది. తాజా ఫోటోల్లో ఆమె ఉత్సాహంగా ఉండటం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే క్రికెట్ సిరీస్‌లు
క్రికెట్ మైదానంలో స్మృతి మంధాన సందడి మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ 21 నుండి భారత్, శ్రీలంక జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో స్మృతి కీలక పాత్ర పోషించనుంది. జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభం కానుంది. ఇందులో స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు సారథ్యం వహించనుంది.

తొలి మ్యాచ్‌లోనే హై-వోల్టేజ్ పోరు
మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లోనే ఆసక్తికర పోరు జరగనుంది. జనవరి 9న యల్ ఛాలెంజర్స్ బెంగళూరు(స్మృతి మంధాన), ఇండియన్స్ (హర్మన్‌ప్రీత్ కౌర్) జట్లు తలపడనున్నాయి. టీమిండియా కెప్టెన్, స్ కెప్టెన్ తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
