For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మృతి మంధాన ఎమోషనల్ పోస్ట్.. తెర వెనుక విషాదం ఇదేనా?

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు 2025 సంవత్సరం ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఓ వైపు మైదానంలో పరుగుల వరద పారించి జట్టుకు ప్రపంచ కప్ అందించిన ఆనందం, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు స్మృతిని ఎంతగానో కుదిపేసాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన 'క్రిప్టిక్ పోస్ట్' ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులో ఆమె రాసిన ఒక్క లైన్ ఆమె జీవితంలోని ఒడిదుడుకులను ప్రతిబింబిస్తోంది.

భగవద్గీత సందేశంతో స్మృతి మంధాన పోస్ట్
స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో గతేడాదికి సంబంధించిన కీలక క్షణాలతో కూడిన ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ప్రపంచ కప్ గెలిచిన సంబరాలు, కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలు, ఆమె ఫిట్‌నెస్ కసరత్తులు ఉన్నాయి. అయితే ఈ వీడియో చివరలో ఆమె రాసిన శ్రీమద్భగవద్గీత వాక్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. "మీకు ఏదైనా చాలా మంచి జరగడానికి ముందు, ప్రతిదీ విచ్ఛిన్నమైపోతుంది (Everything falls apart before something great happens). కాబట్టి ఓపికతో వేచి ఉండండి - భగవాన్ శ్రీకృష్ణుడు" అని ఆమె అందులో పేర్కొంది. తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల నుంచి తాను కోలుకుంటున్నట్లు ఆమె ఈ పోస్ట్ ద్వారా సూచించింది.

Smriti Mandhana Emotional New Year Post Sparks Discussion About Her Personal Struggles

కెరీర్లో బెస్ట్ ఇయర్.. కానీ పర్సనల్ లైఫ్‌లో..!
గణాంకాల పరంగా చూస్తే 2025 స్మృతి మంధాన కెరీర్‌లో బెస్ట్ ఇయర్. గతేడాది ఆమె టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 1703 పరుగులు సాధించింది. మహిళా క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా (మిథాలీ రాజ్ తర్వాత) ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె అద్భుత ప్రదర్శన వల్లే భారత్ తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గెలిచింది.

స్టేడియంలో విజయకేతనం ఎగురవేసిన స్మృతికి వ్యక్తిగత జీవితంలో మాత్రం తీరని అన్యాయం జరిగింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. డీవై పాటిల్ స్టేడియంలో పలాష్ ఆమెకు సినీ ఫక్కీలో ప్రపోజ్ చేశాడు. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలాష్ ఆమెను మోసం చేస్తున్నాడన్న నిజం తెలియడంతో నవంబర్ 23న జరగాల్సిన వారి వివాహం రద్దయింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికే స్మృతి భక్తి మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవల ఆమె మహాకాళేశ్వరుని సన్నిధిలో భస్మ హారతిలో పాల్గొన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

Story first published: Thursday, January 1, 2026, 13:32 [IST]
Other articles published on Jan 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+