Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లి క్యాన్సిల్ అయింది: ఎట్టకేలకు మౌనం వీడిన స్మృతి మంధాన

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అధికారికంగా రద్దయింది. వారాల తరబడి నెలకొన్న ఊహాగానాలపై స్మృతి మంధాన తొలిసారిగా తన మౌనం వీడింది. తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్రికెటర్ స్మృతి మంధాన అధికారికంగా ప్రకటించారు. స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తమ కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేశాయని ఆమె స్పష్టం చేసింది.

"గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే వదలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా తరఫున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం" అని స్మృతి మంధాన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. తన దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుందని, దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం తన ప్రధాన లక్ష్యమని మంధాన ముగించింది.

Smriti Mandhana Confirms Wedding with Palash Muchhal Cancelled Breaks Her Silence

"నాకు ఎల్లప్పుడూ ఉన్నతమైన లక్ష్యం ఉంది. అదే అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను వీలైనంత కాలం భారత్ తరఫున ఆడాలని, ట్రోఫీలను గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎల్లప్పుడూ దానిపైనే ఉంటుంది. మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది." అని స్మృతి మంధాన స్పష్టం చేశారు.

Story first published: Sunday, December 7, 2025, 13:46 [IST]
Other articles published on Dec 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+