Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsMI : ఇంత ఘోరంగా ఓడటానికి కారణం బ్యాటర్లే: స్మృతి మంధాన

Smriti Mandhana blames poor batting for the second loss in WPL 2023

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమిపాలైంది. టీమిండియా స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆడుతున్న ఈ జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ ఆరంభానికి ముందు ట్రోఫీ నెగ్గే ఛాన్స్ ఈ జట్టుకే ఎక్కువ ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ మ్యాచులు మొదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

రెండో మ్యాచులోనూ చిత్తు..

రెండో మ్యాచులోనూ చిత్తు..

మంధానతోపాటు ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, హెదర్ నైట్ వంటి బిగ్ హిట్టర్లు ఉన్నా కూడా భారీ స్కోర్లు చేయడంలో ఈ టీం విఫలం అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో కూడా అలాగే ఘోరమైన ఓటమిని చవిచూసింది. దీనిపై మాట్లాడిన స్మృతి.. 'ఈ వికెట్‌పై మరింత మంచి స్కోరు చేసి ఉండాల్సింది. మేం అంత గొప్పగా రాణించలేదు. ఆ నిజాన్ని అంగీకరించక తప్పదు. తర్వాతి మ్యాచుల్లో కచ్చితంగా రాణిస్తాం. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ముగ్గురు బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోవడంలో వాళ్లు విఫలమయ్యారు' అని తెలిపింది.

బ్యాటింగ్ వైఫల్యం వల్లనే..

జట్టులో ఉన్న బ్యాటింగ్ సమస్యను సీరియస్‌గా తీసుకుంటామని, మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తామని మంధాన చెప్పింది. 'మా దగ్గర మంచి ఆప్షన్స్‌తో మెరుగైన బౌలింగ్ యూనిట్ కూడా ఉంది. కానీ మేం అంత గొప్పగా ఆడలేదు. కాబట్టి ఇక బౌలర్లు ఏం చెయ్యలేకపోయారు. బ్యాటర్లుగా మేం మెరుగైన స్కోరు చెయ్యాల్సింది' అని మంధాన వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు జరగ్గా.. రెండింటిలో 200పైగా స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఆర్సీబీ మాత్రం 150 పరుగుల మార్కు అందుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. మంధాన, ఎలీస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, హెదర్ నైట్ ఎవరూ కూడా అంత గొప్ప ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు.

అంత టైం లేదు..

మ్యాచుల మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోవడంతో తాము ఈ ఓటమి మూడ్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాల్సిన అవసరం ఉందని మంధాన అభిప్రాయపడింది. 'ఇది చాలా చిన్న టోర్నమెంట్. కాబట్టి ఈ ఓటములపై ఆలోచించే టైం ఉండదు. జట్టు లీడర్‌గా పాజిటివ్‌గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఒక విజయం సాధిస్తే.. ఆ తర్వాత వరుసగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటమిని మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. జట్టులో శ్రేయంక, కణిక ఇద్దరూ మంచి పాజిటివ్ ప్రభావం చూపించారు. జట్టుకు డీసెంట్ స్కోరు అందించడానికి వాళ్లు పడిన కష్టం, పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని బాధ్యతగా ఆడటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం' అని మంధాన పేర్కొంది.

Story first published: Tuesday, March 7, 2023, 8:38 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+