For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అలా జరిగినందుకు బాధగా ఉంది' - క్షమాపణలు చెప్పిన ఆర్సీబీ క్వీన్ స్మృతి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన క్షమాపణలు చెప్పింది. తన టీమ్ మేట్ ఎల్లిస్ పెర్రీకి సారీ చెప్పింది. తన వల్ల తప్పిదం జరిగినందుకు చింతిస్తున్నట్లు పేర్కొంది! ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ లో మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ. తాజాగా సూపర్ ఓవర్ కు దారీ తీసిన మ్యాచ్ లో యూపీ వారియ్స్ పై ఓడిపోయింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ ఓవర్. అయితే ఈ మ్యాచ్ లో మొదట ఎల్లీస్ పెర్రీ‌(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 నాటౌట్) అదిరే ప్రదర్శన చేసింది. కానీ ఆమెను సూపర్ ఓవర్ కు పంపించలేదు స్మృతి మంధాన. 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 4 పరుగులే చేయగలిగింది. ఫలితంగా యూపీ వారియర్స్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లీస్ పెర్రీని సూపర్ ఓవర్ కు పంపించి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Smriti Mandhana apologizes to Ellyse Perry after super over loss in rcb vs up warriorz wpl 2025

ఈ క్రమంలోనే మ్యాచ్ తర్వాత మాట్లాడిన స్మృతి మంధాన.. "ఎల్లీస్ పెర్రీకి సారీ చెప్పింది. "ఎల్లీస్ పెర్రీ మంచి ఆల్ రౌండర్. మహిళా క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్ ఆమె. ఆమె బ్యాటింగ్ అద్భుతం. నిజంగా ఆమెకు క్షమాపణలు చెప్పాలి. జట్టుగా మేమంతా ఆమెకు సారీ చెప్పాలి. ఆమె కోసం మ్యాచ్ గెలవలేకపోయాం. ఈ రోజు ఓడిపోవం నిరాశకు గురి చేసింది. బాధగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో మంచిగా రాణించాం. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ ఓటమిని అంగీకరించాం. బలంగా తిరిగి వస్తాం." అని మంధాన చెప్పుకొచ్చింది.

అంతకుముందు ముంబయి ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. అప్పుడు కూడా ఎల్లీస్ పెర్రీ 43 బంతుల్లో 81 పరుగులు దూకుడు ప్రదర్శన చేసింది. కానీ అది కూడా వృథా అయిపోయింది.

Story first published: Tuesday, February 25, 2025, 13:50 [IST]
Other articles published on Feb 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+